కరోనా వైరస్ గురించి నిజాలు దాచి ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం సృష్టించడమే లక్ష్యంగా చైనా ఈ బయో వెపెన్ ప్రయోగించింది అని ఇప్పటికీ విశ్లేషకులు బలంగా చెబుతూనే ఉన్నారు. ఇలా ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభం రావడానికి కారణమైన చైనా ఇప్పుడు అదే కరోనా వైరస్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్నది. చెడపకురా చెడేవు అనే నానుడి ప్రస్తుతం చైనాఈ విషయంలో నిజం అవుతుంది అన్నది అర్ధమవుతుంది. గత కొంత కాలం నుంచి చైనాలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగి పోతూ ఉండడంతో వివిధ ప్రాంతాలలో మళ్లీ చైనా ప్రభుత్వం లాక్డౌన్ విధించే పరిస్థితులు వస్తున్నాయి.
అయితే గత ఇరవై ఒక్క నెలలో ఎన్నడూ లేనంతగా కరోనా వైరస్ ప్రభావాన్ని ప్రస్తుతం ఎదుర్కొంటుంది చైనా. ఇప్పటికే 11 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు జియాంగ్ సహా మరికొన్ని ప్రాంతాలలో కూడా కఠిన ఆంక్షలు అమలులోకి తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇలా ఇప్పటికే ఆర్థిక సంక్షోభం కారణంగాతీవ్ర ఇబ్బందులు పడుతున్న చైనాను ఇక కరోనా వైరస్ కూడా అంతకంతకూ పెరిగి పోతూ ఉండటం మరింత ఇబ్బందులకు గురి చేస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి