జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అవ్వటం చంద్రబాబునాయుడు+ఎల్లోమీడియాకు ఏమాత్రం ఇష్టంలేదు. చిరంజీవి తనకు బాగా సన్నిహితుడని చంద్రబాబు చెప్పిన రెండు రోజుల్లోనే జగన్, చిరంజీవి భేటీ అవ్వటం చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియాకు షాక్ కొట్టినట్లయ్యింది. అసలు చిరంజీవి పేరును చంద్రబాబు తీసుకొచ్చిందే వ్యూహాత్మకం. పీఆర్పీ వల్లే తాను ఓడిపోయినట్లు చెప్పుకున్నారు. అయితే అప్పట్లో వచ్చిన విశ్లేషణల ప్రకారం పీఆర్పీ వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకు 11 శాతం నష్టపోతే, టీడీపీ 6 శాతం నష్టపోయింది.
సరే అప్పటి విషయాన్ని వదిలేస్తే ఇపుడు చిరంజీవి ప్రస్తావనను చంద్రబాబు ఎందుకు తెచ్చినట్లు ? జనసేనతో పొత్తుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కుదరకపోతే కాపుల ఓట్లను తెచ్చుకోవాలన్నది ప్లాన్. ఇందులో భాగంగానే చిరంజీవి ప్రస్తావన తెచ్చింది. కానీ రెండు రోజుల్లోనే జగన్తో తాడేపల్లి క్యాంపాఫీసులో చిరంజీవి వింధు చేయటాన్ని ఎల్లోబ్యాచ్ తట్టుకోలేకపోయింది. అందుకని వెంటనే చిరంజీవికి రాజ్యసభ సీటును జగన్ ఆఫర్ చేశారంటు ఫీలర్స్ వదిలారు.
అలాగే జగన్-చిరంజీవి భేటీకి లాయర్ నిరంజన్ రెడ్డే ఏర్పాటు చేశారంటు రఘురామరాజుతో చెప్పించారు.  నిజంగా వీళ్ళద్దరు భేటీ అవ్వాలంటే మధ్యలో లాయర్ ఎందుకు ? చిరంజీవికి సన్నిహితులైన పేర్నినాని, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, సామినేని ఉదయభాను లాంటి చాలామందున్నారు. ఇపుడేమో మళ్ళీ నరసాపురంలో తనపై పోటీకి చిరంజీవిని జగన్ అడిగారంటు రఘురాజుతో చెప్పిస్తున్నారు. ఇక్కడ ఎల్లోబ్యాచ్ బాధేమిటంటే జగన్ కు చిరంజీవి ఎక్కడ దగ్గరైపోతారో? కాపుల ఓట్లలో తమకు ఎక్కడ గండి పడుతుందో అనే టెన్షనే కనబడుతోంది.
ఒకవైపేమో తనకు రాజ్యసభ ఆఫర్ ఎవ్వరు ఇవ్వలేదని, తనకు ఆసక్తి కూడా లేదని చిరంజీవి నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. అయినా వినకుండా చిరంజీవిని వైసీపీ ట్రాప్ లో పడేసిందని, చిరంజీవిని వైసీపీ టార్గెట్ చేసిందంటు పిచ్చి కథనాలు రాస్తునే ఉన్నారు. వార్తలు, కథనాలు వండి వారుస్తున్నదే ఎల్లోబ్యాచ్. మళ్ళీ చిరంజీవిని టార్గెట్ చేస్తున్నదెవరని ? చిరంజీవిపై దుష్ప్రచారం చేస్తున్నదెవరంటు అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి జగన్తో మెగాస్టార్ భేటీ అవటాన్ని ఏమాత్రం తట్టుకోలేకపోతున్నట్లున్నారుగా ?మరింత సమాచారం తెలుసుకోండి: