ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి నేత పరిపాలనలో తనదైన ముద్ర వుండాలని కోరుకోవటం సహజం. అయితే అలా జరగటం కొందరి విషయంలోనే సాధ్యమవుతుంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ విషయంలో ఇపుడిదే జరిగింది. యోగి పాలనలో కొన్ని మరకలు ఉన్నప్పటికీ బలమైన ముద్ర కూడా ఉంది. అదేమిటంటే గ్యాంగ్ స్టర్లను ఏరిపారేయటం. రాష్ట్రంలో అయినా పరిపాలనంతా చీఫ్ సెక్రటరీ, ఉన్నతాధికారుల సలహాలు, సూచనలతోనే జరిగిపోతుంటుంది.




కానీ ఒక్క పోలీసు వ్యవస్ధ మాత్రమే ముఖ్యమంత్రి అభీష్టం ప్రకారం జరుగుతుంది.  శాంతి భద్రతల విషయంలో సీఎం గట్టిగా ఉంటే పోలీసులు కూడా తమ శక్తికి మించి పనిచేస్తారు. యూపీలో ఇపుడదే స్పష్టంగా కనబడుతోంది. యూపీ అంటేనే గ్యాంగ్ స్టర్లకు, మాఫియాకు పెట్టిందిపేరు. యోగి సీఎం కాకముందు మాఫియాలు, గ్యాంగ్ స్టర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయేవారు. అలాంటి ఒకానొక గ్యాంగ్ స్టర్ ముఖిం కాలా గ్యాంగ్. ఈయనగారి కార్యస్ధానం కైరానా అనే పట్టణం. ఈ పట్టణానికి మినీ పాకిస్ధాన్ అనే పేరుందుంటేనే ఇక్కడ జరిగే వ్యవహారాలు అర్ధమైపోతుంది.




స్మగ్లింగ్, దొంగనోట్ల ముద్రణ, ఆయుధాల తయారీ, వ్యాపారం, డ్రగ్స్, కిడ్నాపులు, హత్యలకు కైరానా పట్టణం పెట్టిందిపేరు. పై మొత్తాలు జరిగేది ముఖిం కాలా కనుసన్నల్లోనే. ఈయన ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కు అత్యంత సన్నిహతుడు. అఖిలేష్ సీఎంగా ఉన్నపుడు ముఖిం కు స్వర్ణయుగమేనట. అలాంటిది యోగి సీఎం అయిన తర్వాత సీన్ మారిపోయింది. కైరానా పట్టణంలో హిందువులు, ముస్లిం జనాభా దాదాపు సమానంగా ఉండేది. ముఖిం మద్దతుతో హిందువుల వ్యాపారాలను, వ్యవసాయ భూములను, ఆస్తులను అన్నింటినీ ముఖిం గ్యాంగ్ కబ్జా చేసేసిందట. రెగ్యులర్ గా హిందువులను కిడ్నాపులు చేయటం డబ్బులు తీసుకుని వదిలేయటమే ముఖిం గ్యాంపు పనట. యోగి సీఎం అయ్యేనాటికి కైరానాలోని హిందువుల్లో చాలామంది ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయారట.




యోగి సీఎం కాగానే ఫీడ్ బ్యాక్ తీసుకుని ముందు కైరానా మీదే దృష్టిపెట్టారట. అప్పటికే అక్కడ పనిచేస్తున్న పోలీసులందరినీ మార్చేసి పూర్తిగా కొత్తవారిని నియమించారు. పోలీసు అధికారులకు నూరుశాతం స్వేచ్చ ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ స్ధాపనకు ఏది అవసరమైతే ఆ చర్యలు తీసుకోమన్నారట. ఇంకేముంది పోలీసులకు తమ టార్గెట్ ఏమిటో అర్ధమైపోయి రెచ్చిపోయారు. బాధ్యతలు తీసుకున్నప్పటినుండి ముఖిం గ్యాంగ్ పైనే దృష్టిపెట్టారు. దొరికినవాళ్లని దొరికినట్లు ఎన్ కౌంటర్ల పేర్లతో ఏరిపారేశారు.




ముఖిం గ్యాంగ్ లో 120 మందిని పోలీసులు ఎన్ కౌంటర్ చేసేశారు. వీరిలో ముఖం తమ్ముడితో పాటు అత్యంత కీలకమైన నేరస్తులున్నారు. వీళ్ళు మాత్రమే కాకుండా ఇతర గ్యాంగుల్లోని మరో 80 మందినీ ఏరేశారు. చివరకు ప్రాణభయంతో ముఖిం పోలీసులకు లొంగిపోయాడు. దాంతో చాలమంది ముఖిం అనుచరులు, ఇతర గ్యాంగ స్టర్లు యూపీ నుండే పారిపోయారట. అప్పటివరకు వీళ్ళకు మద్దతుగా నిలిచిన కైరానా ఎంఎల్ఏ నహీద్ హసన్ కూడా లొంగిపోయాడట. ఇదంతా చూసిన తర్వాత కైరానా నుండి వెళ్ళిపోయిన హిందువులంతా తిరిగి ఊరికి చేరుకున్నారట. యూపీలో గ్యాంగ్ స్టర్లకు యోగి ఎలా చెక్ పెట్టారనేందుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇందుకే యోగి అంటే జనాల్లో అంత క్రేజు పెరిగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: