భారత్-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్మీ పటిష్టవంతం చేయడమే లక్ష్యంగా భారత ప్రభుత్వం ముందుకు సాగుతుంది అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఎంతో అధునాతన టెక్నాలజీతో కూడిన ఆయుధాలను భారత అమ్ములపొదిలో చేర్చయడమే లక్ష్యంగా భారత రక్షణరంగం ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో ఎన్నో ఆయుధాలు ఇప్పటికే భారత అమ్ములపొదిలో వచ్చిచేరాయి అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా భారత వాయుసేనా  మరింత పటిష్టవంతంగా మార్చేందుకు ఫ్రాన్స్ నుంచి లేకుండా రాఫెల్ యుద్ధ విమానాలను ప్రత్యేకంగా తయారు చేయించుకుని భారత అమ్ములపొదిలో చేర్చింది. రఫెల్ చేరికతో ప్రస్తుతం భారత వాయుసేన ఎంతో పటిష్టవంతంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే భారత వాయుసేన ఎంతో పటిష్టంగా మారడానికి మరిన్ని ఆయుధాలను సమకూర్చుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఇలా అధునాతనమైన  ఆయుధాల కొనుగోలు చేయడానికి ఏకంగా యజ్ఞంలా నిర్వహిస్తుంది భారత ప్రభుత్వం. ఒకవైపు బ్రహ్మోస్ లాంటి క్షిపణులను ఇతర దేశాలకు అమ్ముతూ ఆయుధ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడమే కాదు ఇతర దేశాల నుంచి ఆయుధాలను కూడా కొనుగోలు చేస్తోంది భారత ప్రభుత్వం. అయితే ఇప్పటికే రాఫెల్ కొనుగోలు చేసిన భారత ప్రభుత్వం ఇక ఇప్పుడు మరింత శక్తివంతమైన ఎఫ్ 18 యుద్ధ విమానాలను కూడా కొనుగోలు చేసేందుకు సిద్ధమైందని అంటూ గత కొన్ని రోజుల నుంచి అంతర్జాతీయ మీడియాలో టాక్ వినిపిస్తోంది.


 ఇక ఇప్పుడు ఏకంగా ఎఫ్ 18 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు రష్యా సిద్ధమైనట్టు తెలుస్తోంది. కాగా ఇవి రాఫెల్ యుద్ధ విమానాల కంటే ఇక అమెరికా కు సంబంధించినటువంటి ఎఫ్ 18 యుద్ధ విమానాలు మరింత సమర్థవంతంగా పని చేస్తాయి అని భావించిన భారత ప్రభుత్వం వీటిని కొనుగోలు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకేసారి నాలుగున్నర వేల కిలోల బాంబులు క్యారీ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయట. అంతేకాకుండా ఒకేసారి  మిసైల్స్ కూడా ప్రయోగించేందుకు ఈ యుద్ధ విమానాలు సామర్థ్యం కలిగి ఉంటాయట. ఇలా ఒక వైపు అమెరికాతో స్నేహబంధాన్ని కొనసాగిస్తూనే మరోవైపు భారత ఆయుధ వ్యవస్థను మరింత పెంచుకునేందుకు భారత ప్రభుత్వం ఇలాంటి వ్యూహాన్ని అమలు చేసింది అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: