ఆడాలేడు మియాసాబ్... ఈడా లేడు మియాసాబ్ అంటూ సాగే భీమ్లా నాయక్ సినిమా టైటిల్ సాంగ్ నెట్టింట్లో వైరల్.  ఆ టైటిల్ సాంగ్ విడుదల ఆయిన తరువాత అందరి దృష్టిని ఆకర్షించినవి రెండు అంశాలు.  ఆ పాట పాడిన మొగిలయ్య, ఆయన వాయించిన వాద్యం కిన్నెర.  అంతరించి పోతున్న 13 మెట్ల కిన్నెరకు ఆఖరి వాద్యాకారుడు దర్శినం మొగిలయ్య. నేటికీ తన బతుకులో ఎలాంటి మార్పూ లేని ఈయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ గౌరవాన్ని ప్రకటించింది.
దర్శినం మొగిలయ్య్ తన కిన్నెరను  వాయిస్తూ భీమ్లానాయక్ సినిమాలో పాడిన మియాసాబ్  గీతం వెనుక చాలా చరిత్ర ఉంది. ఆ సినిమాలో  మొగిలయ్య పాటలో కొంత మార్పులు చేశారు.  ఆ పాట మహబూబ్ నగర్ ప్రాంతంలో పీడిత ప్రజానీకానికి అండగా నిలిచిన పోరాట యోధుడు మియాసాబ్ పై  ఆశువుగా ఆలపించిన పాట అది. ఒక్క మియాసాబ్ మాత్రమే కాదు, రాజ్యానికి వ్యతిరేకంగా పోరు  చేసిన నాయకుల మీద, ఇంకా చెప్పాలంటే పోరుబాట పట్టి అమరులైన వారి మీద  మొగిలయ్య పాటలు పాడతారు.  సర్కారీ చెరలో మగ్గిన వారి చరితకు సమాచార వారధి లాంటి వ్యక్తి. పాలకులకు వ్యతిరేకంగా పాటలు కట్టి  పాడిన వారికి ప్రభుత్వం పద్మ పురస్కారాన్ని ప్రకటించడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసే అంశం.  సామాన్యులే నిజ‌మ‌యిన ప‌ద్మ‌శ్రీ‌లు అనడానికి ఇది చక్కని తాజా ఉదాహరణ.
ఈ కిన్నెర వాయిద్యాన్ని మొగిలయ్య వంశపారంపర్యంగా నేర్చుకున్నారు. ఆయన తరువాత ఈ వాయిద్యాన్ని వాయిచే వారు లేరు. ఇతనే చిట్టచివరి కళాకారుడని పరిశోదకులు పేర్కోంటున్నారు. తన పాటల్లోని శృతి,రాగం అంతా కూడా తన పూర్వీకులు కట్టినవే నని మొగిలయ్య గతంలో తనను కలసిన విలేకరులకు తెలిపారు. తన పాటల్లోని వ్యక్కులు, వారి చరిత్రలు కూడా తాను పూర్వీకుల నుంచే తెలుసుకున్నానని  చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మొగిలయ్యకు కళాకారుల పింఛన్ అందిస్తోంది. మొగిలయ్య పాటలపై రంగయ్య అనే వ్యక్తి పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు. నాలుగవ శతాబ్దం నుంచే కిన్నెర వాయిద్యం ఉన్నట్లు చాలా చాలా స్పష్టమైన ఆధారాలున్నాయని  ప్రోఫెసర్ జయధీర్ తిరుమల రావు పేర్కోంటున్నారు.  ఎన్నో కళారూపాలు అంతరించి పోయాయి. మరికొన్ని అంతరించి పోవడానికి క్యూలో ఉన్నాయి. కిన్నెర వాయిద్యం కూడా ఆ జాబితా లోనిదే.
----

అంతరించి పోతున్న 13 మెట్ల కిన్నెర వాయిద్యానికి ఆఖరి వాద్యకారుడు దర్శినం మొగిలయ్య. ఆయన పాటల్లోని అంశాలు మనకు కన్నీళ్లు తెప్పిస్తాయి. నేటికీ  బతుకులో ఎలాంటి మార్పూ లేని ఈయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ గౌరవాన్ని ప్రకటించింది. ఇది తెలుగువారు గర్వించ తగ్గ అంశం. అరుదైన కళాకారుడికి లభించిన పురస్కారం


మరింత సమాచారం తెలుసుకోండి: