జగన్మోహన్ రెడ్డి ఏది ప్లాన్ చేసినా ప్రత్యర్ధులకు ఒకపట్టాన అర్ధంకాదు. జగన్ ప్లానింగ్ లో సామాజికసమీకరణలు, సీట్లు, ఓట్లు ఇలా అనేకం ఉంటాయి. ఎవరైనా రాజకీయంగా నిర్ణయం తీసుకునేటపుడు ఇలాంటవన్నీ చూడటం సహజమే. కానీ దాన్ని వర్కవుట్ చేసే విధానం, జనాల్లోకి తీసుకెళ్ళే పద్దతిలోనే సక్సెస్ రేటు ఆధారపడుంటుంది. ఈ పద్దతిలో చూస్తే జగన్ ప్లానింగ్ బ్రహ్మాండమనే చెప్పాలి. కొత్తగా ఏర్పడిన విజయవాడ జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టడంలో జగన్ అలాంటి మాస్టర్ ప్లానే వేసినట్లున్నారు.
ఈసారి వేసిన మాస్టర్ ప్లాన్ వర్కవుటవుతుందో లేదో తెలీదు కానీ ప్లానింగ్, ఎగ్జిక్యూషన్ మాత్రం బ్రహ్మాండమనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే విజయవాడ జిల్లాకు ఎన్టీయార్ పేరు పెట్టడం వెనుక రాజకీయంగా పెద్ద ప్లానే ఉంది. అదేమిటంటే ఎన్టీయార్ అభిమానులతో పాటు కమ్మ సామాజికవర్గాన్ని దగ్గరకు తీసుకోవటం. తనపైన కమ్మ వ్యతిరేకి అనే ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీని లేవకుండా దెబ్బకొట్టడమే.
జిల్లాకు ఎన్టీయార్ పేరుపెట్టినంత మాత్రాన కమ్మోరి ఓట్లన్నీ వైసీపీకి పడిపోతాయా ? పడిపోతాయనే భ్రమలో ముణిగిపోవటానికి జగన్ ఏమీ పిచ్చోడు కాదు. పడవని తెలుసు కాకపోతే తనపైన టీడీపీ వేయటానికి ప్రయత్నిస్తున్న కమ్మధ్వేషి అనే ముద్ర నుండి బయటపడచ్చు. ఈమధ్య జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడ మాట్లాడినా కమ్మోరికి జగన్ వర్గశతృవు అని పదే పదే చెబుతున్న విషయం తెలిసిందే. నిజానికి ఏ వర్గానికీ ఏ రాజకీయ నేత కూడా శతృవుగా చూడరు.
కమ్మ సామాజికవర్గాన్ని జగన్ కు దూరం చేయటానికి పవన్ ప్లాన్ వేశారు. దానికి విరుగుడుగానే జగన్ చేతల్లో చూపిస్తున్నారు. తొందరలోనే గుంటూరు సీనియర్ నేత మర్రి రాజశేఖర్ కు రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇస్తారనే ప్రచారం మొదలైంది. ఎన్టీయార్ అభిమానులను, కమ్మోరిని వైసీపీకి దగ్గర చేసే బాధ్యతను కొడాలినాని, వల్లభనేని వంశీలపై జగన్ ఉంచారట. అందుకనే వీళ్ళద్దరు కమ్మ సామాజికవర్గానికి అన్యాయం జరిగిందే చంద్రబాబు వల్లంటు పదే పదే చెబుతున్నది.
ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీతో పాటు పార్టీని కూడా లాక్కున్న ద్రోహి చంద్రబాబు అంటు కొడాలి, వంశీ తరచు చెబుతున్నారు. దీన్ని ఎవరూ కాదనలేరు. ఎన్టీయార్ పై చంద్రబాబుకున్నదంతా కపటప్రేమని గట్టిగా చెబుతున్నారు. అందుకనే ఎన్టీయార్ పేరును జగన్ ఒక జిల్లాకు పెడితే కనీసం ప్రభుత్వానికి ధన్యవాదాలు కూడా చెప్పటం లేదంటు గుర్తుచేస్తున్నారు.
ఎన్టీయార్ అబిమానులు జగన్ కు ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెబుతున్నది ఇందులో బాగమే. మొత్తానికి వచ్చే ఎన్నికల నాటికి కమ్మ సామాజికవర్గానికి తనపైన సాఫ్ట్ కార్నర్ ఉండేట్లు చూసుకోవటమే జగన్ ప్లాన్ అని చెబుతున్నారు. మరి ఎంతవరకు వర్కవుటవుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి