జనసేన పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు అవుతున్నా సరే మన పవన్ కల్యాణ్ కథ మారేలా లేదు..ఎప్పటికప్పుడు ఏదొక పార్టీ తోక పట్టుకుని రాజకీయం చేసేలాగానే కనిపిస్తున్నారు. రాజకీయాల్లో సొంతంగా నిలబడే ప్రయత్నాలు చేసినట్లే ఉంటారు గాని...అవేమీ ఉపయోగపడవని మాత్రం అర్ధం అవుతున్నట్లు కనిపించడం లేదు. సరే పార్టీ పెట్టిన మొదట్లో అంటే ఇబ్బందులు ఉంటాయి..కాబట్టి అప్పుడు టీడీపీ-బీజేపీలకు మద్ధతు ఇచ్చారు. సరే తర్వాత ఎన్నికల్లో తొలిసారి రంగంలోకి దిగుతున్నారు కాబట్టి..కమ్యూనిస్టులని కలుపుకుని బరిలో దిగారు..ఫెయిల్ అయ్యారు.

ఇక అప్పుడే పార్టీ బలం ఏంటో అర్ధమైపోయింది..అంటే జనసేనకు పెద్దగా బలం లేదని అర్ధం చేసుకోవచ్చు.. మరి అలాంటప్పుడు పార్టీని ఇంకా బలోపేతం చేయాల్సిన బాధ్యత పవన్‌దే కదా..కానీ ఆయన మాత్రం ఆ పని చేస్తున్నట్లే కనిపించడం లేదు..ఏదో కేంద్రం మద్ధతు ఉంటుందన్నట్లు..బీజేపీతో కలిసి ముందుకెళ్లిపోతున్నారు...సరే బీజేపీ వల్ల పావలా ప్రయోజనం లేదనే సంగతి తెలిసిందే. దాంతో బీజేపీని వదిలేసి...స్వతహాగా ఇంకా ఎదిగే ప్రయత్నాలు చేయాలి...కానీ అలాంటివేమీ చేస్తున్నట్లే కనిపించరు..సినిమాలు తీసుకుంటున్నారు, హిట్లు కొడుతున్నారు. కానీ రాజకీయంగా హిట్ ఎప్పుడు కొడతారో అర్ధం కావడం లేదు.

ఇక ఎప్పటిలాగానే మళ్ళీ టీడీపీ తోక పట్టుకుని ముందుకెళ్లడానికి సిద్ధమవుతున్నారని ఎప్పటినుంచో కథనాలు వస్తున్నాయి...పైగా బాబు కూడా పవన్‌ని కలుపుకోవాలనే ఆతృతగా ఉన్నారు. ఆయన ఆతృతని కూడా బయటపెట్టేశారు. అప్పుడే జనసైనికులు తెగ హడావిడి చేసేశారు...పవన్‌కు సీఎం సీటు ఇస్తే పొత్తు పెట్టుకుంటామని షేర్ ఖాన్‌లా మాట ఇచ్చేశారు.

అసలు టీడీపీ పెద్ద పార్టీనా లేక జనసేన పెద్ద పార్టీనా...టీడీపీ సీఎం సీటు ఎందుకు ఇస్తుంది. ఆ పార్టీకి ప్రపోజల్ పెట్టడం కంటే...సొంతంగా పోటీ చేసి పవన్‌ని సీఎంగా చేసుకోవచ్చుగా. అలా చేయడం కుదరదు..ఎందుకంటే జనసేనకు బలం లేదు కాబట్టి. ఇవన్నీ పవన్‌కు తెలుసు...అందుకే కల్యాణ్ బాబు మళ్ళీ యథావిధిగానే తోక కథని కంటిన్యూ చేస్తూ...టీడీపీతో కలిసి ముందుకెళ్లడానికి రెడీ అవుతున్నారని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: