తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు గత రెండు వారల నుండి భగ్గుమంటున్నాయి. కేసీఆర్ రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యల నుండి నిన్న కాంగ్రెస్ పార్టీ చేసిన ధర్నాల వరకు ప్రతి విషయం వివాదంగా మారుతోంది. తాజాగా చూస్తే ప్రముఖ రాజకీయ నాయకుడు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసు అధికారులు అరెస్టు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్దనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఆయనను తీసుకెళ్లారు. ఈ రోజు తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడంతో పార్టీలోని ప్రముఖ నాయకులు అందరూ సమాయత్తం అవుతున్న వేళ ఇలా జరిగింది.

ఈ క్రమంలో నాయకుడు రేవంత్ రెడ్డి సైతం సిద్ధమవుతున్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై కేసు నమోదు చేసి ఆయనను అరెస్ట్‌ చేయాలన్న డిమాండ్‌తో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల ముందు ధర్నా చేసేందుకు గాను తెలంగాణ పీసీసీ పిలుపు ఇవ్వగా ఈ క్రమంలో ఇలా అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాకకీయాల్లో అనతి కాలంలోనే గొప్ప గుర్తింపును సంపాదించారు యువ నాయకుడు రేవంత్ రెడ్డి. అతి తక్కువ కాలంలోనే ప్రజల నాడి ఎరిగిన నాయకుడిగా తెలంగాణ జనులకు దగ్గరయ్యారు ఈ నేత.

ఈయనకు ప్రజల్లో మంచి మద్దత్తు బాగా ఉన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఆయన అరెస్ట్ కావడంతో పరిస్థితులు ఎలా మారుతాయన్న సందర్భం ఏర్పడింది. దీనిపై కాంగ్రెస్ నాయకులు ఏ విధంగా స్పందించనున్నారో తెలియాల్సి ఉంది. ఈ అరెస్ట్ మూలంగా ధర్నాలు రాస్తారోకోలు ఏమైనా ఆగే పరిస్థితి ఉందా అన్నది తెలియాలంటే కొంత సమయం వేచి చూడాల్సిందే. కేసీఆర్ కావాలనే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించారంటూ భగ్గుమంటున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: