అవసరానికి తగ్గట్టుగా రాజకీయం చేయడంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ని మించినవారు లేరనే చెప్పాలి...ఆయన పైకి ప్రజల కోసం ఏదో చేసేస్తున్నట్లు చెబుతారు గాని...కానీ ఆయన చెప్పే ప్రతి మాటలోనూ రాజకీయం ఉంటుందనే చెప్పాలి..రాజకీయ అవసరం లేకుండా ఏది చెప్పారు..ఏది చేయరు...ఎంతైనా ఆయన కూడా ఒక రాజకీయ నాయకుడే కదా..అవసరమైతే కొన్ని విషయాలు కేసీఆర్ సైతం ఒప్పుకుంటారు...ఆ మధ్య హుజూరాబాద్ ఉపఎన్నికని దృష్టిలో పెట్టుకుని దళితబంధు స్కీమ్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే...అంటే ఉప ఎన్నికల్లో గెలవడానికే ఈ స్కీమ్ తీసుకొచ్చారని విమర్శలు వచ్చాయి...కేసీఆర్ సైతం అవును ఓట్ల కోసమే స్కీమ్ తెచ్చామన్నట్లు మాట్లాడారు.

ఇలా కేసీఆర్ ప్రతి స్టెప్‌లోనూ రాజకీయం ఉంటుంది...ఇక ఇటీవల బీజేపీ టార్గెట్‌గా కేసీఆర్ దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే..పైగా దేశ రాజకీయాలని మార్చేస్తానని చెప్పి కేసీఆర్ హడావిడిగా తిరుగుతున్నారు...అలాగే రాష్ట్రంలో కూడా ఎప్పటికప్పుడు భారీ సభలు పెడుతూ ప్రజలని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా కేసీఆర్ సరికొత్త స్ట్రాటజీతో ముందుకొచ్చారు...అసలు తెలంగాణ రావడానికి కారణమైన నిరుద్యోగులకు లబ్ది కలిగేలా కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో దాదాపు 90 వేల పైనే ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేసేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు.

త్వరలోనే ఈ ఉద్యోగాల భర్తీ కార్యక్రమం పూర్తి చేయనున్నారు...ఇలా ఉద్యోగాలు ఇవ్వడం వల్ల కేసీఆర్‌కు రాజకీయ నిరుద్యోగం లేకుండా పోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వంపై నిరుద్యోగులు ఎంత కోపంతో ఉన్నారో చెప్పాల్సిన పని లేదు. అలాగే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది ఇలాంటి సమయంలో కేసీఆర్ ఉద్యోగాల భర్తీ కార్యక్రమం పెట్టడం రాజకీయంగా చాలా అడ్వాంటేజ్ అవుతుందని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల..టీఆర్ఎస్ నేతలకు రాజకీయ నిరుద్యోగం ఉండదనే చెప్పాలి...ఎందుకంటే ఈ వ్యతిరేకతలో గెలవడం కష్టం...ఇప్పుడు ఉద్యోగాలు ఇవ్వడం ప్లస్ అవుతుంది కాబట్టి...టీఆర్ఎస్‌కు రాజకీయ నిరుద్యోగ సమస్య ఉండదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: