ప్రత్యర్ధులను ఇరుకున పెట్టడానికి ప్రతి రాజకీయపార్టీ ఒక్కో వ్యూహం పన్నుతుంటుంది. రాబోయే ఎన్నికల్లో అధికార వైసీపీని ఇరుకునపెట్టి దెబ్బతీయటానికి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంపార్టీ ఐదు అంశాలను ప్రచారాస్త్రాలుగా రెడీ చేసుకున్నట్లుంది. ఈ ఐదు అంశాలను టీడీపీ జనాల్లోకి ఎంత ఎఫెక్టివ్ గా తీసుకెళుతుంది ? జనాలు దాన్ని ఎంతవరకు అంగీకరిస్తారు అనేదానిపై వైసీపీ గెలుపోటములు ఆధారాపడుంది. ఉండటానికి చాలా అంశాలే ఉన్న ఐదింటిమీదే ఎక్కువగా దృష్టిపెట్టబోతున్నట్లు సమాచారం.





ఇంతకీ టీడీపీ రెడీ చేసుకున్న ఐదు అంశాలు ఏమిటి ? ఏమిటంటే మొదటిది వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు. రెండోది అమరావతి రాజధాని అంశం. మూడోది భువనేశ్వరిని అవమానించటం, నాలుగోది మహిళలు, యువతులపై హత్యాచారాలు. ఐదోది దళితులపై దాడులు.  ఈ ఐదు అంశాలనే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రయోగించి ఎన్నికల్లో లబ్ది పొందాలన్నది చంద్రబాబునాయుడు వ్యూహం.





ఇందులో భాగంగానే ప్రతిరోజు వివేకానందరెడ్డి హత్యకేసును తమ్ముళ్ళు పదే పదే ప్రస్తావిస్తున్నారు. అలాగే తన భార్య భువనేశ్వరిని వైసీపీ నేతలు అవమానించారని నానా గోల చేస్తున్నారు. నిజానికి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసింది టీడీపీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీయే. వంశీపై యాక్షన్ తీసుకునే దమ్ము చంద్రబాబు లేకే మీడియా సమావేశంలో కన్నీళ్ళు రాకుండా భోరుమని ఏడ్చింది. దీన్ని విస్తృతంగా రాష్ట్రమంతా ప్రచారం చేసేందుకు ప్లాన్ కూడా రెడీ అయిపోయింది.





మహిళలు, యువతులపై హత్యాచారాలంటు టీడీపీ గోల చేస్తున్నాది. నిజానికి దొంగతనాలు, అత్యాచారాలు, హత్యాచారాలు, గొడవల్లాంటివి ప్రభుత్వాలను బట్టి జరగవు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా జరిగేవి జరిగిపోతునే ఉంటాయి. అలాగే దళితులపై దాడులు కూడా జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే పెరిగింది కాదు. చంద్రబాబు హయాంలో కూడా జరిగాయి. కానీ తమ హయాంలో దాడులు, అత్యాచారాలు ఏమీ జరగనట్లు అన్నీ ఇప్పుడే జరుగుతున్నట్లు టీడీపీ గోల చేస్తోంది. సరే చంద్రబాబు ఏమి చెప్పినా విచక్షణ మరచిపోయే ఎల్లోమీడియా ఉండనే ఉంది ప్రచారం చేయటానికి. మరి ఈ ఐదు అస్త్రాలను వైసీపీ ఎలా ఎదుర్కుంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: