ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం చెందారు. దీనితో ఎమ్మెల్యే గా ఉన్న ఆత్మకూరు నియోజకవర్గం లో ఖాళీ అయింది. అందుకే రెండు రోజుల క్రితం ఆత్మకూరుకు ఉప ఎన్నిక జరిగింది. అయితే అనూహ్యంగా ఈ ఉప ఎన్నికలో ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీ పాల్గొనక పోవడం గమనార్హం. అందుకు ప్రధాన అభ్యర్థులుగా వైసీపీ నుండి గౌతమ్ రెడ్డి సోదరుడు విక్రమ్ రెడ్డి... అలాగే బీజేపీ నుండి భరత్ కుమార్ మధ్యనే ప్రధాన పోటీ ఉంది. అయితే ఎప్పటి లాగే ఎన్నికల అనంతరం ఫలితాల కోసం పోటీ చేసిన అభ్యర్థులు మరియు ఆయా పార్టీల అధిష్టానాలు కూడా తీవ్ర ఒత్తిడి లో ఉన్నాయి. కానీ ముందు నుండి రాజకీయ విశ్లేషకులు చెబుతున్న ప్రకారం వైసీపీదే విజయం అని తెలుస్తోంది.

కానీ ఇక్కడ మెజారిటీ గురించి చర్చ ఎక్కువగా జరుగుతోంది. సిట్టింగ్ స్థానాన్ని గెలుచు కోవడం పెద్ద గొప్ప కాదని... కనీసం లక్ష ఓట్ల మెజారిటీని కూడా తెచ్చుకోకపోతే పార్టీ పట్ల ప్రజల్లో నమ్మకం పోయిందని అర్ధం అన్నట్లు మాటలు ప్రచారంలో ఉన్నాయి. దీనితో సీఎం జగన్ మరియు అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రులు మరియు ఎమ్మెల్యేలు కూడా ఒత్తిడి లో ఉన్నారు. ఇక బీజేపీ అయితే ఖచ్చితంగా గెలుస్తాము అన్న ధీమాను ప్రదర్శిస్తున్నారు. కానీ ఏ పార్టీ గెలుస్తుంది అన్నది తెలియాలంటే మాత్రం రేపు తెలియనుంది .

రేపు ఆత్మకూరు లో ఆంధ్ర జూనియర్ కాలేజ్ లో ఎన్నికల లెక్కింపు ప్రక్రియ జరగనుంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు స్టార్ట్ కానుండగా... మొత్తం 14 రౌండ్లు జరుగనుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం రేపు మధ్యాహ్నం కల్లా ఫలితం తేలే అవకాశం ఉంది. వైసీపీ మళ్ళీ లక్ష ఓట్ల మెజారిటీతో విజయ దుందుభి మోగిస్తుందా చూడాలి.   

మరింత సమాచారం తెలుసుకోండి: