ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు పరువంతా ఒక్కసారిగా పోతోంది. అప్పుడెప్పుడో 1995లో ఎన్టీయార్ కు వెన్నుపోటుపొడిచి ముఖ్యమంత్రి కుర్చీని లాగేసుకున్నపుడు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ఇపుడు దెబ్బ కొడుతోంది. అప్పట్లో ఒక ఇంగ్లీషు పేపర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడుతు ‘వుయ్ డోంట్ నీడ్ ఎన్టీయార్’ అనే చాలా హార్ష్ గా చెప్పారు. సరే కాలం గిర్రున తిరిగి ఇపుడు హెల్త్ యూనివర్సిటీకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం  ఎన్టీయార్ పేరును తీసేసింది.


దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని చంద్రబాబు పెద్ద ప్లాన్ వేశారు. పార్టీ తరపున ఆందోళనలు చేయిస్తునే ఎన్టాయర్ వారసులను కూడా రంగంలోకి దింపారు. అయితే అందరు కలిపి ఎంత ప్రయత్నించినా ఏమీ కాలేదు. ఎందుకంటే  ఎన్టీయార్ కు వెన్నుపోటుపొడిచిందే చంద్రబాబు+ఎన్టీయార్ సంతానం అంటు మంత్రులు, వైసీపీ నేతలు జనాల్లోకి బాగా ఎక్కించారు. 1995లో వారసుల అండతో చంద్రబాబు+దగ్గుబాటి ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ ను ఇపుడు మంత్రులు, సీనియర్ నేతలు జనాలకు పదే పదే గుర్తుచేస్తున్నారు.

దాంతో చంద్రబాబు, వారసులు జగన్ కు వ్యతిరేకంగా  ఏమి మాట్లాడినా జనాలు అసలు పట్టించుకోవటంలేదు. ఈ విషయం ఇలాగుండగానే విజయవాడ నగరంలో ఎక్కడచూసినా చంద్రబాబు ఫొటో ఉన్న పేపర్ కట్టింగుల హోర్డింగులు పెద్దపెద్దవి వెలిశాయి. అదేమిటయ్యా అంటే వుయ్ డోంట్ నీడ్ ఎన్టీయార్ అని అప్పట్లో ఎన్టీయార్ ను అవమానిస్తు చంద్రబాబు ఇంటర్వ్యూ వార్త.

ఎవరుదాన్ని బయటకు తీశారో ? ఎవరు దాన్ని ఎన్లార్జి చేసి పోస్టర్లుగా మార్చారో తెలీదు కానీ సిటీలోని చాలాచోట్ల అవే పెద్ద హోర్డింగులుగా కనబడుతున్నాయి. దాంతో చంద్రబాబు, వారసులే కాదు చివరకు తమ్ముళ్ళకు కూడా ఏమి మాట్లాడాలో నోరు లేవట్లేదు. యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేస్తే తీసేశారులే అని సరిపెట్టుకునుంటే ఏదో పద్దతిగా ఉండేది. అలా కాదని జగన్ కు వ్యతిరేకంగా రచ్చ చేద్దామని మొదలుపెట్టేసరికి ఇపుడు పోతున్నది చంద్రబాబు పరువే. మరి తన పరువును ఎలా కాపాడుకుంటారో ఏమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: