కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవ్వటం ఆలస్యం కొందరు ఎంఎల్ఏలు బీఆర్ఎస్ నుండి జంప్ అవ్వటానికి రెడీ అవుతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇందుకు భద్రాచలం బీఆర్ఎస్ ఎంటఎల్ఏ తెల్లం వెంకటరావు వ్యవహారమే ప్రధాన కారణం. వెంకటరావు గెలిచినట్లు అధికారిక ప్రకటన వచ్చే సమయానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని తేలిపోయింది. దాంతో వెంటనే భద్రాచలం నుండి హైదరాబాద్ చేరుకున్న తెల్లం నేరుగా పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేసులో దూసుకుపోతున్న రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.





భేటీ విషయం తెలియటంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చాలామంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఎందుకంటే అప్పటికి ఫలితాలు పూర్తిగా రాలేదు. ఫలితాలు పూర్తిగా రాకుండానే బీఆర్ఎస్ ఎంఎల్ఏ తెల్లం కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నట్లు ప్రచారం పెరిగిపోయింది. అయితే తర్వాత  తెల్లం మీడియాతో మాట్లాడుతు తాను కాంగ్రెస్ పార్టీలో చేరటంలేదని కేసీయార్ తోనే ఉంటానని వివరణిచ్చారు. అయితే ఈ వివరణను ఎవరునమ్మటంలేదు. ఎందుకంటే తెల్లం మొదటినుండి కాంగ్రెస్ నేత కమ్ పొంగులేటి శ్రీనివాసులరెడ్డికి స్ట్రాంగ్ మద్దతుదారుడు.





కాంగ్రెస్ లో తనకు టికెట్ రాదని తెలుసుకుని వెంటనే బీఆర్ఎస్ లో చేరి ఎంఎల్ఏ టికెట్ తెచ్చుకుని గెలిచారు. అంటే గెలిచింది బీఆర్ఎస్ తరపున అయినా వ్యక్తిమాత్రం మొదటినుండి కాంగ్రెస్సే. పైగా ఇపుడు కాంగ్రెస్సే అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఏదో రోజు తెల్లం కాంగ్రెస్ లోకి వచ్చేయటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే  కొంతమంది ఎంఎల్ఏలు కూడా కాంగ్రెస్ లోకి వచ్చేయటం ఖాయమని అనుకుంటున్నారు.





హైదరాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎంఎల్ఏలే ఎక్కువట. ఎందుకంటే వీళ్ళల్లో ఎక్కువమందికి రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడు. పైగా వీళ్ళలో చాలామంది టీడీపీ బ్యాచే. డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకుని, నియోజకవర్గాలకు నిధులు కావాలని ఏదో కారణంగా అప్పట్లో బీఆర్ఎస్ లోకి ఎలాగ వెళ్ళారో ఇపుడు కూడా అలాగే కాంగ్రెస్ లోకి చేరిపోతారని ప్రచారం పెరిగిపోతోంది. మొత్తానికి అప్పట్లే కాంగ్రెస్ లో నుండి బీఆర్ఎస్ లోకి వెళ్ళినట్లే ఇపుడు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చేస్తారని చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: