తెలుగు రాష్ట్రాలలోని పాపులర్ ఛానల్స్ మీడియా సంస్థలు సైతం పవన్ కళ్యాణ్ ని పూర్తిగా పక్కకు పెట్టేసినట్టు తెలుస్తోంది. ఆయన సభలు పెట్టిన ఏదో హెడ్లైన్స్ కోసం మాత్రమే కొన్ని చానల్స్ వేస్తున్నారు తప్ప కవరేజ్ మాత్రం పూర్తిగా చేయడం లేదు.. దీంతో పవన్ కళ్యాణ్ పార్టీ కానీ ఆయన ప్రసంగాలు కానీ ఏవి ప్రస్తుతం ప్రజలలో పెద్దగా వినపడడం లేదు దీంతో అటు జనసేన కార్యకర్తలు పార్టీ శ్రేణులు కూడా బాధపడుతున్నారు. ప్రచారమనేది కూడా ప్రధాన పాత్ర రాజకీయాలలో పోషిస్తుంది.
అలాంటి రాజకీయ పార్టీలకు ప్రచారం అనేది ముఖ్యం కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో అలాంటిదేమీ లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.అసలు పవన్ కళ్యాణ్ బయటకు వచ్చిన సంగతి గాని ఆయన పార్టీలో ఏం చేస్తున్నారనే విషయం కూడా చాలామందికి తెలియకుండానే ఉంది. అయితే వినిపిస్తున్న సమాచారం చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ జైలు బయట చేసిన హంగామా తో పాటు పొత్తు ప్రకటించడంతో అభిమానులు సైతం కార్యకర్తలు నిరాశ చెందారు.. అప్పటినుంచి జనసేన హవా కూడా తగ్గిపోయింది.. ఆరోజు అలా చెప్పకపోయి ఉంటే పరిస్థితి వేరే లాగా ఉండేదని అభిమానులు వాపోతున్నారు.దిని కారణంగానే టిడిపి తో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన హవా తగ్గిపోయిందని జనసేన కార్యకర్తలు అభిమానులు కూడా తెలియజేస్తున్నారు. గతంలో అభిమానుల సైతం తమ నాయకుడు మాట్లాడిన మాటలని సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసేవారు.. కానీ టిడిపి తో పొత్తు వల్ల అది చాలా తగ్గిపోయింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలో కూడా నెమ్మదిగా ఉంటున్నారు. మరి ఎలక్షన్ సమయంలో ఏం జరుగుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి