పార్టీల్లోని అభ్యర్ధులను చూసిన వాళ్ళు ఇపుడు అయ్యోపాపం అభ్యర్ధులు అనుకోవాల్సొస్తోంది. దీనికి కారణం ఏమిటంటే ఎన్నికల ప్రక్రియ 57 రోజులుండటమే. షెడ్యూల్ ప్రకటించిన రోజునుండి పోలింగ్ జరిగే నాటికి తెలుగురాష్ట్రాల్లో గ్యాప్ 57 రోజులుంది. ఎన్నికలను కేంద్ర ఎన్నికల కమీషన్ మార్చి 16వ తేదీన ప్రకటిస్తే పోలింగ్ మే 13వ తేదీన జరగబోతోంది. మామూలుగా అయితే ఎక్కువరోజుల వ్యవధి ఉండదు కాబట్టి అభ్యర్ధులకు పెద్దగా సమస్యలుండేవి కావు. ఇన్నిరోజుల వ్యవధి కారణంగా ముందు దెబ్బతినేది అభ్యర్ధులనే చెప్పాలి.





అభ్యర్ధులపైన  రెండురకాలుగా దెబ్బపడటం ఖాయం. మొదటిదేమో తడిసిమోపెడవబోయే ఖర్చు. రెండోది ఎండలు మండిపోతుండటం. పోయిన ఎన్నికల్లో కూడా ఎన్నికల ప్రక్రియ 27 రోజులు జరిగింది. అలాంటిది రాబోయే ఎన్నికలకు అదనంగా 30 రోజులు కలిసి 57 రోజులైంది. విషయం ఏమిటంటే ఓపెన్ కేటగిరీలోని చాలా నియోజకవర్గాల్లో   ప్రధాన అభ్యర్ధులకు భరించలేని ఖర్చలవుతాయి. ఒక అంచనా ప్రకారం ఓసీ నియోజకవర్గాల్లో ప్రధాన అభ్యర్ధుల మొత్తం ఖర్చు సుమారు చెరో 70 కోట్ల రూపాయలవుతుంది. అంటే గెలుపుకోసం ఇద్దరు అభ్యర్ధుల మధ్య హోరాహోరీ పోరాటం జరిగిందంటే ఆ నియోజకవర్గంలో అయిన ఖర్చు సుమారు రు. 150 కోట్లని లెక్క.





అలాగే ఓసీ పార్లమెంటు నియోజకవర్గంలో ఇద్దరు బలమైన అభ్యర్ధుల ఖర్చు సుమారు రు. 400 కోట్లవుతుందని అంచనా. పోయిన ఎన్నికల్లోనే గుంటూరు పార్లమెంటులో ఇద్దరి అభ్యర్ధులు సుమారు 240 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ ఖర్చులన్నీ 27 రోజుల్లో జరిగిందని మాత్రమే అని గుర్తుంచుకోవాలి. రాబోయే ఎన్నికల్లో వైసీపీ, టీడీపీకి చావోరేవో లాంటివి. గెలుపుకు రెండు ప్రధాన పార్టీల అభ్యర్దులు ఎంతైనా ఖర్చులకు వెనకాడరనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో 57 రోజులు ఎలక్షనీరింగ్ చేయాలంటే అభ్యర్ధులు నిండా ముణిగిపోవటం ఖాయం.





ఒక అంచనా ప్రకారం ఓసీ పార్లమెంటు నియోజకవర్గంలో ఖర్చు ఒక్కోరికి సుమారు రు. 300 కోట్లవుతుంది. అలాగే అసెంబ్లీ నియోజకవర్గం ఖర్చు రు. 150 కోట్లయిపోతుంది. ఖర్చుల అంచనాలతోనే అభ్యర్ధులకు చెమటలు పట్టేస్తుంటే ఇక మండిపోయే ఎండల్లో  57 రోజులు ప్రచారం చేయాలంటే వాళ్ళ అవస్తలగురించి చెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పుడే ఇంత ఎండలున్నాయి. అలాంటిది ఏప్రిల్, మే నెలల్లో ఎండలంటే....అందుకే పాపం అభ్యర్ధులని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: