కేంద్రంలో మరొకసారి అధికారం రావాలని బిజెపి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికి రెండుసార్లు అధికారంలో ఉన్న ఎన్డీఏ మరొకసారి హ్యాట్రిక్ కొట్టాలని ముందుకు వెళ్తోంది. ఈసారి 400 స్థానాలతో గెలిచేలా ప్లాన్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో బలమైన అభ్యర్థులను సైతం దింపే విధంగా బిజెపి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. ఇలాంటి సమయంలో  ఉమ్మడి అనంతపూర్ జిల్లా హిందూపూర్ లోక్సభ స్థానాన్ని శ్రీ పీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు.


కానీ ఆ స్థానం నుంచి టిడిపి అభ్యర్థి బి కే పార్థసారధిని ప్రకటించడంతో మరొకవైపు బిజెపి పోటీ చేసే ఆరు లోక్సభ స్థానాలను అభ్యర్థులను కూడా ప్రకటించేసింది. ఇలాంటి సమయంలోనే పరిపూర్ణానంద స్వామి రాబోయే ఎన్నికలలో ఇండిపెండెంట్గా హిందూపూర్ నుంచి పోటీ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పరిపూర్ణానంద స్వామి గురించి చెప్పాల్సిన పనిలేదు.. హిందూ మత వ్యాప్తి కోసం ఎన్నో జిల్లాలను విదేశాలలో పర్యటిస్తూ బాగానే పాపులారిటీ సంపాదించారు. ముఖ్యంగా కాకినాడలో శ్రీ పీఠం అనే ఒక పేరుతో కూడా ఒక ఆశ్రమాన్ని నిర్వహించారు.


ఎప్పుడూ కూడా ఆధ్యాత్మిక బోధనలు నిత్యం ఆధ్యాత్మిక సేవలోనే ఉండే పరిపూర్ణానంద స్వామి తెలంగాణ ఎన్నికల ముందు పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చారు. అలా కేంద్రమంత్రి అమిత్  షా సమక్షంలో బిజెపిలోకి చేరారు. అప్పటినుంచి రాజకీయాలలో చురుకుగా పాల్గొంటున్నారు. అయితే అక్కడ ఎన్నికలలో బిజెపి ఓడిపోవడంతో మళ్లీ రాజకీయాలలో కనుమరుగయ్యారు. ఇప్పుడు తాజాగా ఏపీలో సైతం సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేల ఒకసారిగా ఈయన పేరు హిందూపూర్ లోక్సభ తనదే అంటూ ప్రచారం జరిగాయి అందుకు తగ్గట్టుగా RSS మద్దతు కూడా పూర్తి రావడంతో నిజమే అనుకున్నారు. కానీ ఊహించని విధంగా హిందూపూర్ లోక్సభ అభ్యర్థిగా బికే పార్థసారదిని టిడిపి ప్రకటించింది. దీంతో పరిపూర్ణానంద స్వామి ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో అక్కడ నేతలకు సైతం ఈయన తలనొప్పిగా మారారు.

మరింత సమాచారం తెలుసుకోండి: