ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా కూడా పార్లమెంట్ ఎన్నికల హడావిడిని కనిపిస్తూ ఉంది. అభ్యర్థులను ప్రకటించడంలో నిమగ్నమయ్యాయి అని పార్టీలు. ఇక గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు సిద్ధమవుతున్నాయ్. అంతేకాదు మిగతా పార్టీలను మించి ఓటరు మహాశయులను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పటిలాగానే ప్రధాన పార్టీల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు తీవ్ర స్థాయిలో కొనసాగుతూ ఉన్నాయి.



 ఇక మరీ ముఖ్యంగా  అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య అయితే పార్లమెంట్ ఎన్నికల నేపద్యంలో పోటీ మరింత తీవ్రంగా ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారాన్ని దక్కించుకుంటే బిఆర్ఎస్ ఓడిపోయి ప్రతిపక్ష హోదాలో మాత్రమే మిగిలిపోయింది. అయితే ఇప్పుడు మాత్రం పార్లమెంటు ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇలాంటి సమయంలో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బిఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. కాగా ఇటీవల పార్లమెంట్ ఎన్నికలవేళ వరుసగా కీలక నేతలతో సభలు నిర్వహిస్తూ ఉన్నారు కేటీఆర్. కాగా ఇటీవల సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులతో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేటీఆర్ చేసిన విమర్శలు సంచలనంగా మారిపోయాయి.


 పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిజెపి లో చేరే మొదటి వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అంటూ కేటీఆర్ కామెంట్ చేశాడు. జీవితకాలమంతా కాంగ్రెస్ లోనే ఉంటానని.. రేవంత్ ఎన్నడూ కూడా చెప్పలేదు. బిజెపిని ఆపే దమ్ము కాంగ్రెస్కు లేదు. తెలంగాణలో కాంగ్రెస్ కాదు బిజెపి అధికారంలో ఉన్నట్లు ఉంది పరిస్థితి. రేవంత్ బిజెపి పాట పాడుతున్నారు. మోదీ రాహుల్ గాంధీని చౌకీదార్ చోర్ అంటే.  రేవంత్ మాత్రం బడే బాయ్ అంటున్నారు. ఇక అక్కడ అదాని మంచోడు కాదంటే.. ఇక్కడ రేవంత్ మంచోడు అని చెబుతున్నాడు. ఇదంతా చూస్తుంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి తన మనుషులతో కలిసి బిజెపిలో చేరడం ఖాయమని అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: