కొన్ని రోజుల క్రితమే తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇందులో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీని తెచ్చుకొని తెలంగాణ లో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ... రేవంత్ రెడ్డి ఫుల్ సక్సెస్ అయ్యారు. చాలా చోట్ల బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అనుకున్న స్థానాలలో కూడా జనాల్లో మంచి క్రేజ్ ఉన్న క్యాండిడేట్ లను నిలబెట్టి గెలుపు సాధించారు. ఇక మరికొన్ని రోజుల్లోనే పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలలో సీటు దక్కని వారు మరియు రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిన మరి కొంత మంది పార్లమెంట్ సీట్ లను ఆశించారు. అందులో ఎవరికి అయితే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వారికి సీట్ లను ఇచ్చే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో బీసీ జనాభా ఎక్కువ ఉంది. దానితో బీసీ లకు ఎక్కువ టికెట్ లను ఇచ్చి మాకు సామాజిక న్యాయం కల్పించాలి అని కాంగ్రెస్ పార్టీ బీసీ నేతలు మొదటి నుండి తమ గలం వినిపిస్తున్నారు.

ఇక ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి విడుదల చేసిన కాంగ్రెస్ అభ్యర్థుల లిస్టులో కేవలం ఇద్దరు మాత్రమే బీసీ కాండిడేట్ లు ఉన్నారు. ఇక దానితో కాంగ్రెస్ బీసీ అభ్యర్థులు మాకు కనీసం సగం అయిన సీట్లు ఇవ్వాలి అని అంటున్నారు. ఇక తెలంగాణ లో మంచి క్రేజ్ ఉన్న బిఆర్ఎస్ ... బిజెపి పార్టీ లు బీసీలకు ఎక్కువ టికెట్ లను ఇవ్వడంతో ఇప్పుడు కాంగ్రెస్ పై ఈ ప్రెషర్ పడింది. మరి కాంగ్రెస్ పార్టీ కూడా బీసీలకు ఎక్కువ టికెట్ లను ఇస్తుందా లేదా అనేది మరికొన్ని రోజుల్లో క్లారిటీ గా తెలిసి అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: