`రండి.. మేం కడుపులో పెట్టుకుంటాం. మీకు న‌ర‌సాపురం టికెట్‌నే ఇస్తాం. కాక‌పోతే.. మీరు ఏం కోరుకుంటే అది మీరే తీసుకోండి. మీరు ఇంకెవ‌రికైనా టికెట్లు ఇవ్వాల‌ని అనుకుంటే.. వారికి కూడా ప‌రిశీలిస్తాం. వ‌చ్చేయండి. కండువా క‌ప్పుకోండి. పార్టీలోనూ మీకు త‌గిన గౌర‌వం ఇస్తాం` ఇదీ.. కాంగ్రెస్ పార్టీ న‌ర‌సాపురం రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజుకు ఇచ్చిన భారీ ఆఫ‌ర్‌. ప్ర‌స్తుతం ఆయ‌న ఏ పార్టీకి కూడా కొర‌గాకుండా పోయిన నేప‌థ్యంలో ఒంట‌రిగా ఉన్నారు. టికెట్ కోసం వేచి చూస్తున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌, క్ష‌త్రియ సామాజిక వ‌ర్గంలో నిజాయితీ ప‌రుడిగా పేరున్న క‌నుమూరిబాపిరాజు ద్వారా పంపిన కీల‌క సందేశం అని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అయితే.. దీనిపై ర‌ఘురామ ఇంకా రియాక్ట్ కావాల్సి ఉంది. ఆయ‌న బీజేపీ కోసం ఎదురు చూస్తున్నారు. వ్యాపారాలు, వ్య‌వ‌హారాలు.. వ్యాపారాల‌పై కేసులు, వ్యక్తిగ‌తంగా ఆయ‌న‌పై కేసులు ఉన్న నేప‌థ్యంలో బీజేపీ అయితేనే బెట‌ర్ అని భావిస్తున్నారు. అందుకే.. బీజేపీ సీటును ఎనౌన్స్ చేసిన త‌ర్వాత‌.. కూడా ఆయ‌న దింపుడు క‌ళ్లం ఆశ‌లను వ‌దిలి పెట్ట‌డం లేదు.

కానీ, కేంద్రంలోని బీజేపీ మాత్రం ఆయ‌న వంక చూడ‌డం లేదు. పైగా.. బీజేపీనే క్షేత్ర‌స్థాయిలో మ‌రో రెండు పార్టీలైన టీడీపీ, జ‌న‌సేన‌ల‌ను కూడా నియంత్రిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ర‌ఘురామ రాజును పార్టీలోకి తీసుకుని ఏదైనా అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేయించాల‌ని చంద్ర‌బాబు భావించారు. అయితే.. ఈ ప్ర‌తిపాద‌న అలా తెర‌మీదికి వ‌చ్చిన కొన్ని గంట‌ల్లోనే చంద్ర‌బాబు మ‌న‌సు మార్చుకున్నారు. ర‌ఘురామ విష‌యంపై ఆయ‌న వ్యూహాత్మ‌కంగా మౌనం పాటిస్తున్నారు. అంటే.. ఆయ‌న‌ను ఎవ‌రో నియంత్రిస్తున్నార‌నే చ‌ర్చ‌సాగుతోంది.

ఇక‌, జ‌న‌సేన కూడా ర‌ఘురామ గురించి ఎక్క‌డా ఒక్క మాట కూడా మాట్లాడ‌డం లేదు. ఇలాంటి స‌మ‌యం లో నేనున్నానంటూ.. ర‌ఘురామ ముందుకు వ‌చ్చారు. ఆయ‌న‌కు భారీ ఆఫ‌రే ఇచ్చింది. ఆయ‌న ప‌రివా రంలో ఒక‌రిద్ద‌రికి టికెట్ లు కూడా ఇస్తామ‌ని చెప్పింది. కానీ, రేపు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక‌పోతే.. త‌న‌పై బీజేపీ క‌క్ష క‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రించే అవ‌కాశం ఉంటుంద‌ని ర‌ఘురామ భావిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆచితూచి అడుగులు వేయ‌నున్నారని తెలుస్తోంది. చివ‌ర‌కు ఏం చేస్తార‌నేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: