ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్ష హోదాతో మాత్రమే సరిపెట్టుకుంది బిఆర్ఎస్. మొన్నటి వరకు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ. దీంతో కెసిఆర్ కి ఊహించని షాక్ తగిలింది  అంతలోనే అధికారాన్ని చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఇట్స్ రివేంజ్ టైం అంటూ.. ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టి  ఏకంగా బిఆర్ఎస్ లోని కీలక నేతలందరినీ కూడా తమ పార్టీలోకి లాగేసుకుంటుంది. దీంతో బిఆర్ఎస్ లో పరిస్థితి మరింత గందరగోళంగా మారింది. అయితే ప్రస్తుత టిఆర్ఎస్ పని అయిపోయిందని అనుకుంటున్న ఎంతోమంది నేతలకు.. పార్టీ సత్తా ఏంటో నిరూపించాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలలో విజయం సాధించాలి.


 పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సాధిస్తే .. కీలక నేతల పార్టీని వీడిన ఉన్న నేతల్లో మాత్రం కాస్త ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ గులాబీ దళపతి కేసీఆర్ కు మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లో విజయంపై బొత్తిగా ఇంట్రెస్ట్ లేదేమో  అనే భావన అందరికీ కలుగుతుంది  ఎందుకంటే గెలుపు గుర్రాలను బరిలోకి దింపాల్సిన కేసీఆర్ ఓడిపోతారు అని తెలిసిన కొంతమందికి ఛాన్స్ ఇస్తున్నారు అంటూ రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. అలాంటి వారిలో కాసాని జ్ఞానేశ్వర్ కూడా ఒకరు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ నేత కాసాని జ్ఞానేశ్వర్ కి ఛాన్స్ ఇచ్చారు గులాబీ దళపతి.


 బీసీలకు పెద్దపీట వేస్తున్నామని బీసీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా.. గెలుపు విషయం మాత్రం కెసిఆర్ మరిచిపోయాడు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎందుకంటే సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి టిఆర్ఎస్ను వదిలి కాంగ్రెస్ లో చేరి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఇంకోవైపు బిజెపి నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా గడ్డి పోటీ ఇస్తున్నారు. ఇలాంటి సమయంలో కాస్త పట్టు తక్కువగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ప్రత్యర్థి పార్టీలకు పోటీ ఇవ్వగలడా అన్నది అనుమానం. కనీసం ప్రత్యర్థుల ఓట్లైనా చీల్చగలడా అనే విషయంపై కూడా రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని కేసిఆర్ కు .. ఇంట్రెస్ట్ లేనట్టుందని.. అందుకే ఓడిపోతారని తెలిసినా అలాంటి అభ్యర్థులకే ఛాన్స్ ఇస్తున్నారని తెలంగాణ రాజకీయాల్లో చర్చ నడుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Kc4