తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి అనుకున్నది సాధించారు. టిడిపి నుంచి కాంగ్రెస్ లోకి అడుగుపెట్టిన ఆయన ఇక కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇలాంటి విమర్శలు అన్నింటిని కూడా దాటుకుని ఏకంగా హస్తం పార్టీని ఫామ్ లోకి తీసుకువచ్చారు. ఏకంగా తెలంగాణ తీసుకోవచ్చాము అనే సెంటిమెంట్ తో ముందుకు సాగుతున్న బీఆర్ఎస్ పార్టీని కాదని...  ప్రజలు హస్తం పార్టీ వైపు మళ్ళేందుకు ఎంతగానో శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


 అయితే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీపై రివెంజ్ తీసుకుంటున్నారు రేవంత్. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎలా అయితే ఇక బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని హస్తం పార్టీకి ప్రతిపక్ష హోదానే లేకుండా చేయాలి అనుకున్నారో.. ఇక ఇప్పుడు రేవంత్ కూడా ఇలాంటి ఆలోచనతోనే ముందుకు సాగుతున్నారు. ఏకంగా బీఆర్ఎస్ పార్టీలోని కీలక నేతలందరినీ కూడా కాంగ్రెస్ గూటికి చేర్చుకుంటున్నారు. దీంతో ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోతుంది అని చెప్పాలి.



  గులాబీ దళపతి కేసీఆర్ ను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు రేవంత్. అయితే ప్రస్తుత పరిణామాలు చూసి రేవంత్ రెడ్డి రివెంజ్  స్టార్ట్ చేశాడు అని అందరూ అనుకున్నారు. కానీ తాను ఇంకా మొదలు పెట్టలేదని ఇటీవల రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఢిల్లీలో ఇండియా టీవీ చేపట్టిన ఆప్ కి అదాలత్ ప్రోగ్రాం లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మీరు బిఆర్ఎస్ పై ప్రతీకారం తీర్చుకుంటున్నారా అని  సీనియర్ జర్నలిస్ట్ రజాక్ శర్మ ప్రశ్నించగా.. నేను ఇంకా మొదలు పెట్టలేదు అంటూ రేవంత్ బదులిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ఆరు హామీల అమలు, లోక్సభ ఎన్నికల్లో మేనిఫెస్టో సహా మరిన్ని విషయాలపై ఇక ఈ కార్యక్రమంలో మాట్లాడారు రేవంత్ రెడ్డి. ఒక రకంగా ఇంకా మొదలు పెట్టలేదు కేసీఆర్ కు ముందుంది ముసళ్ళ పండుగ అని వార్నింగ్ ఇచ్చారు రేవంత్.

మరింత సమాచారం తెలుసుకోండి: