దేశ రాజకీయాల్లో అత్యంత కీలకపాత్రను పోషించిన రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ పార్టీ ఒకటి. దేశాన్ని అత్యంత ఎక్కువ కాలం పరిపాలించిన పార్టీలలో కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి స్థానంలో ఉంటుంది. అంతటి రాజకీయ ప్రస్థానం ఉన్న ఈ పార్టీ ప్రస్తుతం మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. రాను రాను పెరగాల్సిన పార్టీ క్రేజ్ తగ్గుతూ వస్తుంది. ఒక్కో ఎలక్షన్ వచ్చేసరికి ఈ పార్టీ లోక్సభ కాండిట్ల సంఖ్య భారీగా తగ్గుతూ వస్తుంది. ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా పోటీ చేయని తక్కువ స్థానాలలో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

1951 వ సంవత్సరం నుండి కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉంది. కానీ ఈ సారి ఈ పార్టీ చాలా తక్కువ స్థానాల నుండి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2014 వ సంవత్సరంలో జరిగిన లోక్సభ ఎన్నికలలో ఈ పార్టీ తరఫున 464 మంది పోటీ చేయగా అందులో కేవలం 44 మంది మాత్రమే గెలుపొందారు. 2019 వ సంవత్సరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీ తరఫు నుండి 421 మంది పోటీ చేయగా 52 సీట్లలో మాత్రమే ఈ పార్టీ నెగ్గింది.

ఇక 2014 నుండి 2019 సమీకరణాలను చూసినట్లు అయితే ఈ పార్టీ నుండి పోటీ చేసిన సభ్యుల సంఖ్య తగ్గినప్పటికీ గెలుపొందిన సభ్యుల సంఖ్య మాత్రం భారీగానే పెరిగింది. ఆ విధంగా ఈ పార్టీ బెటర్మెంట్ ను చూపించింది. ఇక ఈ సారి ఎన్నికలలో మాత్రం ఈ పార్టీ నుండి మరి తక్కువ మంది పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఈ పార్టీ కేవలం 330 మందిని మాత్రమే బరిలో ఉంచబోతున్నట్లు చాలా మంది అంచనా వేస్తున్నారు.

ఇదే కానీ జరిగితే కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తర్వాత నుండి ఇంత తక్కువ స్థానాల్లో పోటీ చేయడం ఇదే మొదటి సారి అవుతుంది. ఇక ఎలక్షన్ లకి చాలా తక్కువ రోజులే ఉంది. మరి ఈ లోపు ఈ పార్టీ తన ప్రణాళికలను మార్చుకొని భారీ సంఖ్యలో కాండేట్ లను బరిలో నిలుపుతుందో..? లేక తక్కువ సంఖ్యలోనే క్యాండిడేట్ లను బరిలో దింపి ఎక్కువ సీట్ లను రాబట్టడం కోసం ప్రయత్నాలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: