ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా సహకార రంగంలో.. అలాగే ఈ వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన ఆప్కాబ్ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది ?అన్నదానిపై కూడా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికలలో పార్టీ కోసం త్యాగం చేసిన సీనియర్లు చాలామంది ఉన్నారు. అందులోనూ మంత్రులుగా పనిచేసి ఎన్నికల్లో సీటు కూడా వదులుకున్న మాజీ మంత్రి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు లాంటి నేతలు కూడా ఉన్నారు. ఇక ఆప్కాబ్ చైర్మన్ పదవిని కచ్చితంగా చంద్రబాబు కమ్మ సామాజిక వర్గానికి ఇస్తారని తెలుస్తోంది. గతంలో కూడా కృష్ణా జిల్లాకు చెందిన తొండపు దశరథ జనార్ధన్.. 2014లో పార్టీ గెలిచాక పిన్నమనేని వెంకటేశ్వరరావు.. టీడీపీ నుంచి ఉన్నారు.
విచిత్రం ఏమిటంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా వసంత నాగేశ్వరరావు, పిన్నమనేని కోటేశ్వరరావు ఇదే కృష్ణా జిల్లా నుంచి సేమ్ కమ్మ సామాజిక వర్గ నేతలుగా ఆఫ్కాబ్ చైర్మన్‌గా పనిచేశారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వీరంతా ఆఫ్కాబ్ చైర్మన్లు ఉన్నారు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆఫ్కాబ్ చైర్మన్ పదవి ఉమ్మడి కృష్ణా జిల్లాకు.. అందులోనూ కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువగా రావడం ఆనవాయితీగా వచ్చింది. ఈసారి కూడా ఆఫ్కాబ్ చైర్మన్ పదవి ఉమ్మడి కృష్ణా జిల్లాకు ఇస్తే ఖచ్చితంగా మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేరు పరిశీలించే అవకాశం ఉందని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఉమాకే ఈ పదవి వస్తే.. ఉమ్మడి కృష్ణా జిల్లా సెంటిమెంటుతో పాటు కమ్మ సామాజిక వర్గ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయినట్టు ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి