దేశ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యంగా దక్షిణాది రాజకీయాలు ఊహించని మలుపు తిరుగుతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని సీ ఓటర్ తాజా సర్వే సంచలన విషయాలు వెల్లడించింది. ఇండియా టుడే-సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఫలితాలు తమిళ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ, ఈ సర్వే ఫలితాలు రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసేలా ఉన్నాయి. ప్రధానంగా అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమి, ఇందులో బీజేపీ, డీఎండీకే వంటి పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి.ఏకంగా 50 శాతం ఓట్లను కొల్లగొట్టే అవకాశం ఉందని సర్వే తేల్చి చెప్పడం విశేషం. ఇది నిజంగా ఊహించని పరిణామం.

మరోవైపు డీఎంకే సారథ్యంలోని కూటమికి మాత్రం కేవలం 38 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే అంచనా వేసింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, విజయ్ వంటి కొత్త తరం నాయకులు, ఇతర చిన్న పార్టీలు కలిసి 12 శాతం ఓట్లను చీల్చుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

సీ ఓటర్ డైరెక్టర్ యశ్వంత్ దేశ్‌ముఖ్ స్వయంగా ఈ విషయాలను అధికారికంగా ప్రకటించడంతో ఈ సర్వేకు మరింత విశ్వసనీయత చేకూరింది. డీఎంకే వ్యతిరేక ఓట్లు మొత్తం ఒక్కతాటిపైకి రావడం, అన్నాడీఎంకే కూటమికి భారీ విజయాన్ని కట్టబెట్టే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు. అదే సమయంలో, డీఎంకే ఓటు బ్యాంకు మాత్రం చీలిపోవడం ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. దాదాపు 12 శాతం ఓట్లు డీఎంకే నుంచి ఇతర పార్టీలకు మళ్లడం అనేది చిన్న విషయం కాదు.

ఓటర్లు ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చేశారని, తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనాత్మకమైన మార్పు రాబోతోందని యశ్వంత్ దేశ్‌ముఖ్ తేల్చి చెప్పారు. దక్షిణాదిలో కొత్త రాజకీయ సమీకరణాలకు తమిళనాడు వేదిక కానుందా? దేశ రాజకీయాల్లోనే ఇది ఒక కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందా? వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: