టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోలు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే వారి నటనతో ప్రేక్షకుల మనసులను దోచుకుంటారు. అలాంటి వారిలో నటుడు నాని ఒకరు. ఈ హీరో తనదైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు. నాని అష్ట చమ్మ సినిమాతో 2008 సంవత్సరంలో తన సినీ కెరీర్ ప్రారంభించారు. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న ఈ హీరో వరుసగా సినిమాలలో అవకాశాలను అందుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకుల పల్స్ పట్టేశారు. 

ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక నాని హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగాను వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తన నిర్మాణ రంగంలో ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించారు. లేటెస్ట్ గా హిట్-3 సినిమాలో హీరో నాని నటించారు. ఇందులో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాలో నాని, శ్రీనిధి మధ్య సన్నివేశాలు కాస్త రొమాంటిక్ గా తీసారని సమాచారం అందుతోంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చేస్తున్నారు.

ఇదివరకే వచ్చిన హిట్, హిట్ 2 సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో హిట్-3 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొన్నాయి. ఇక ఈ సినిమా మే 1వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో చిత్ర బృందం ప్రమోషన్ కార్యక్రమాలను వేగంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నాని, హీరోయిన్ శ్రీనిధి శెట్టి కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. అలిపిరి నుంచి నడక మార్గాన తిరుమల చేరుకున్నారు. మెట్లపై వెళ్తుండగా హీరో నాని తన ముఖం కనిపించకుండా మాస్క్ వేసుకున్నారు.

 హీరోయిన్ కూడా మాస్క్ వేసుకుంది. అభిమానులు గుర్తు పెట్టకుండా ఉండడానికే వీరు ఇలా చేశారని కొంతమంది అంటున్నారు. కాగా, ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని నాని, శ్రీనిధి శెట్టి ఇలా నడక మార్గాన వెళ్లారని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని తన అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: