టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఎలాంటి సపోర్ట్ లేకుండా చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ చిన్నది ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. రకుల్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో తనకంటూ మంచి గుర్తింపు పొందింది.


ఈ సినిమాతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఈ చిన్నది వరసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంది. ఇప్పటివరకు రకుల్ తన కెరీర్ లో ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేసింది. నాగచైతన్య, రామ్ చరణ్, ఎన్టీఆర్, రామ్ పోతినేని, అల్లు అర్జున్, గోపీచంద్, నాగార్జున, రవితేజ లాంటి ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో హీరోయిన్ గా చేసి సక్సెస్ సాధించింది. ఈ చిన్నది ఎన్నో అవార్డులను సైతం సొంతం పొందింది. రకుల్ ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలలో నటించడం లేదు. తన పూర్తి ఫోకస్ బాలీవుడ్ ఇండస్ట్రీ పైన పెట్టింది.


బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది. ఇదిలా ఉండగా.... రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో తనకు సంబంధించిన ఓ విషయాన్ని రకుల్ షేర్ చేసుకున్నారు. తాను ఎప్పుడూ కూడా కాస్మెటిక్ సర్జరీ చేయించుకోవాలని అనుకోవడం లేదని రకుల్ చెప్పారు.

తాను ఇంత వరకు ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని చెప్పింది. తనకు దేవుడు అందమైన ముఖాన్ని ఇచ్చాడని కానీ తాను ఎప్పుడూ సర్జరీల గురించి ఆలోచించలేదని చెప్పింది. అలాగే ఎవరైనా అందం కోసం కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోవాలని అనుకుంటే అందులో ఎలాంటి తప్పు లేదని రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడారు. రకుల్ షేర్ చేసుకున్న ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: