
పది సంవత్సరాలు గొప్పగా పాలించామని కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఫైర్ అయ్యారు. కానీ ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే 8 లక్షల కోట్ల అప్పు చేసి పెట్టారని మండిపడ్డారు. 21 మంది ముఖ్యమంత్రిల పరిపాలనలో చేసిన అప్పు కేవలం 64 వేల కోట్లు మాత్రమేనని వివరించారు. ఇది నిజమా అబద్దమా అంటూ ప్రశ్నించారు జూపల్లి కృష్ణారావు.
ఇక అటు కెసిఆర్ సభపై మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. కాంగ్రెస్ పార్టీని విలన్ అని చేసిన వ్యాఖ్యలను కేసీఆర్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు పొన్నం ప్రభాకర్. సోనియాగాంధీ మినహా తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు ఇవ్వలేరని.. కెసిఆర్ కు తెలుసు అన్నారు. కెసిఆర్ సభకు జనం రాకపోతే పోలీసుల మీద అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెట్టడం సరైన పద్ధతి కాదని... ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్.
అగ్గిపెట్ట రాజకీయానికి బలైపోయిన ఉద్యమకారులకు కనీసం నివారణ అర్పించారా అని ప్రశ్నించారు. అదే సమయంలో కెసిఆర్ ఓ నియంత అంటూ రెచ్చిపోయారు. రజతోత్సవ సభ అంటే వాళ్ల విజయాలు అలాగే పోరాటాల గురించి చెప్పుకుంటారు... కానీ కాంగ్రెస్ పార్టీని తిట్టేందుకే కేసీఆర్ ఈ సభ పెట్టుకున్నారని మండిపడ్డారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు