
ఆనంద్ మహీంద్రా మా ప్రార్థనలన్నీ భద్రతా బలగాలతోనే ఉంటాయని ఒకే దేశం కలిసి నిలబడదామని తెలిపారు. జై హింద్ కీ సేనా.. భారత్ మాతాకీ జై అంటూ రితేష్ దేశ్ ముఖ్ చెప్పుకొచ్చారు. భారత్ మాతాకీ జై న్యాయం జరిగింది అంటూ ఖుష్బూ పేర్కొన్నారు. భద్రతా దళాలకు మరింత బలాన్నివ్వాలని ప్రార్థిద్దాం అని ఒకే దేశం కలిసి నిలబడదాం వందేమాతరం అని మధుకర్ బండార్కర్ అని చెప్పుకొచ్చారు.
పహల్గాం ఈ ఘటన గురించి స్పందించి సంతోషం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ లో ఉన్న స్థానికులు మేము భారత ఆర్మీకి జిందాబాద్ లు కొడుతూ భారతమాతాకీ జై అంటూ నినదించారు. మేము ఇంతటి బాధలోనూ ఆనందపడుతున్నామని మోదీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారని ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
మన కుమార్తెల సింధూరం తుడిచిపెట్టిన ఉగ్రవాదులకు ఇదే సరైన సమాధానం అని బాధిత కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. ఈ ఆపరేషన్ పేరు వినగానే నా కళ్లలో నీళ్లు తిరిగాయని ఈ సందర్భంగా ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నానని పహల్గాం బాధిత కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. నేను ఉదయం నుంచి నిరంతరం చూస్తూనే ఉన్నానని భారత ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నానని బాధిత కుటుంబ సభ్యులు అన్నారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు