
ఈ దెబ్బకు పాకిస్తాన్ సైనికులు చాలామంది చనిపోయారు. ఏకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ ఇంటి దగ్గరే బాంబులు వేసింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ ఇంటికి దాదాపు పది నుంచి 20 కిలోమీటర్ల దూరంలోనే ఈ బాంబు దాడి జరిగింది. ఇక అప్పటికే పాకిస్తాన్ సైన్యం చేతులెత్తేస్తుందన్న అనుమానం కలగడంతో... పాకిస్తాన్ ప్రధాని షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. తన నివాసం నుంచి ఓ బంకర్ లోకి పాకిస్తాన్ ప్రధాని షరీఫ్ వెళ్లినట్లు తెలుస్తోంది.
అందులోనే ప్రస్తుతం పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ ఉన్నాడని సమాచారం. ఇక రెండు రోజులపాటు అక్కడే ఉండి... ఆ తర్వాత విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. లాహోర్ లో ఆయన కోసం ప్రత్యేకంగా ఓ విమానం కూడా రెడీ అయిందని సమాచారం అందుతుంది. అందులో తన కుటుంబంతో పాటు పాకిస్తాన్ ఆర్మీ కీలక అధికారులు అందరూ విదేశాలకు వెళ్ళబోతున్నారట. ఇక.. అదే సమయంలో పాకిస్తాన్ పై బలూచిస్తాన్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఆర్మీ కంటే... BLA నే... పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు