
అయితే మొదట్లో జనాలు నమ్మినప్పటికీ.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావోస్తుఉన్న ఇంకా అదే విషయాన్ని చెప్పుకుంటూ పోతుండడంతో ప్రజలు కూడా నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదో వంకన అకౌంట్లో డబ్బులు వేయడం అలవాటు చేసింది. అలా ప్రజల చేతిలో ఏదో ఒక రూపంలో మనీ ఎక్కువగా ట్రాన్స్ఫర్ కనిపిస్తూ ఉండేది. అయితే ఇప్పుడు దాదాపుగా ప్రజల చేతిలో డబ్బు సర్కులేషన్ ఆగిపోయినట్టుగా కనిపిస్తోంది. ఇలా అసంతృప్తి కనిపించిన సమయాలలో విమానాశ్రయాలు, కొత్త జిల్లాలు ఏర్పాటు, ఉక్కు ఫ్యాక్టరీ ,కొత్త పరిశ్రమలు అంటూ ఏ ఒక్క వాటిని చూపిస్తూ దాటేస్తున్నారట.
ఇక ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఇప్పటివరకు ఏ ఒక్క గుడ్ న్యూస్ కూడ చెప్పకుండా, ఎలాంటి బెనిఫిట్స్ కూడా చెప్పలేదు. సచివాలయ ఉద్యోగులతో అన్ని పనులు చేయిస్తున్నారనే అసంతృప్తి ఉన్నదట.ఇలా అన్నిటిలో కూడా అసంతృప్తి మొదలవుతుందని తెలిసే ఇప్పుడు మళ్లీ ఉచిత 3 గ్యాస్ సిలిండర్ల సబ్సిడీని ఒకేసారి వేయబోతున్నామని, అలాగే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఫ్రీ బస్సు వంటి పథకాలను అమలు చేస్తామంటూ మళ్లీ ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రజలలో అసంతృప్తి సీఎం చంద్రబాబు వరకు వెళ్లిందని చాలామంది మాట్లాడుకుంటున్నారు.. మరి ఒకానొక సమయంలో ఏపీని జగన్ శ్రీలంక చేస్తారని.. అప్పులు పెరిగిపోయాయని చెప్పిన ఇప్పుడు అదే అప్పులతో ఆంధ్రప్రదేశ్ ని నడిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది.. ముఖ్యంగా పథకాలన్నిటినీ కూడా అమలు చేస్తే మరిన్ని అప్పులు తప్పవు ఏపీకి.