
భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం మే 18 వరకు కుదిరిన సంగతి తెలిసిందే.. అయితే ఈ ఒప్పందం చేసుకున్న తర్వాత .. ఆపరేషన్ సిందూర్ ఆగిపోలేదంటూ తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ దొంగగా దెబ్బెయ్యాలని చూస్తే వాటికి బదులు ఇవ్వాలని ఇప్పటికే ప్రధాన నరేంద్ర మోడీ కూడా అన్ని రక్షణ శాఖలకు ఆదేశాలను జారీ చేశారు. ఇలాంటి సమయంలోనే పిఓకేను తిరిగి సొంతం చేసుకోవడమే తమ ఉద్దేశం అన్నట్లుగా భారత్ చాలా స్పష్టంగా పాకిస్తాన్ కి తెలియజేసింది.. అయితే పాకిస్తాన్ కూడా కాశ్మీర్ సమస్యను పరిష్కరించేందుకు యుఎస్ఏ సహాయం కూడా కోరింది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో భారత్ సొంతం చేసుకుంటే ఈ ప్రాంతంలో గుండ చాలా ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుందట. ఆసియా, ఆఫ్ఘనిస్తాన్లకు వెళ్లాలి అంటే పాకిస్తాన్ లేదా ఇరాన్ గుండా వెళ్లాలి.. కానీ పిఓకే సొంతం చేసుకుంటే నేరుగా ఇక్కడ నుంచి చేరుకునే అవకాశం ఉంటుందట..
అలాగే రష్యా నుంచి భారత్ ఆయిల్ని సముద్రం ద్వారా దిగుమతి అవుతూ ఉంటుంది. ఈ పిఓకే స్వాధీనం అయితే రష్యా నుంచి నేరుగా పైప్ లైన్ల ద్వారా ఆయిల్ దిగుమతి చేసుకోవచ్చట. ఈ పిఓకే చాలా దేశాలతో కూడా సరిహద్దు కలిగి ఉన్నదని తెలుస్తోంది. ఆఫ్ఘనిస్తాన్, ఉజ్జికిస్తాన్, కిజికిస్తాన్ తదితర దేశాలతో ఈ పిఓకే సరిహద్దు కలదట. ఇది చైనాకు వాణిజ్యపరంగా కూడా ఉపయోగపడుతున్నాయి. పిఓకే ని ఇండియా స్వాధీనం చేసుకుంటే చైనాకు అడ్డుకట్టు వేసే అవకాశం ఉంటుంది. ఈ పీఓకే లో ఎన్నో సహజ వనరులు ఉన్నాయి.
ఈ పీఓకే లో అను శక్తిని ఉత్పత్తి చేయడానికి యురేనియం కూడా చాలా పుష్కలంగా లభిస్తుంది. ఇక్కడ ఉండే నీటి వల్ల జల విద్యుత్తును కూడా ఉత్పత్తి చేసుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యం జమ్మూ కాశ్మీర్ సస్యశ్యామలంగా మారుతుందట. ఇలా చాలా ప్రయోజనాలు కలిగి ఉన్నాయట.