ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేసినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.. ఏడాదికి మూడు సిలిండర్లను ఉచితంగా అందిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అలాగే నెరవేరుస్తూ ఉన్న కానీ ఇది ఏడాదిలో మూడుసార్లు అంటే నాలుగు నెలలకు ఒకసారి ఒక ఉచిత గ్యాస్ సిలిండర్లని ఇచ్చేలా అమలు చేశారు. గత ఏడాది దీపావళి రోజున ఈ పథకాన్ని అమలు చేయడం జరిగింది. గ్యాస్ తీసుకున్న తర్వాతే నగదు రూపంలో రాయితీ లభిస్తూ ఉండేది.


అయితే ఈ పథకం పైన చాలా గందరగోళం ఎదురవుతూ ఉండడంతో పాటు అమలు చేసిన కూడా పెద్దగా పేరు వినిపించకపోవడంతో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో పలు రకాల మార్పులు చేయబోతున్నారట. ముఖ్యంగా పేదలు మరియు మధ్యతరగతి వర్గాల పైన ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు ఈ ప్రయోజనాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. గతంలో నగదు రాయితీ కూడా ఆలస్యం అవుతూ ఉండడంతో పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు ఫిర్యాదు చేశారు.


ఇలాంటి పరిస్థితి నివారణ కోసమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునే దిశగా అడుగులు వేయబోతున్నారనీ వినిపిస్తున్నాయి. ఇకపై ఏడాదికి ఇచ్చే మూడు సిలిండర్లను ఒకేసారి లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే విధంగా చూడాలని అధికారులను ఆదేశాలను కూడా జారీ చేసినట్లు సమాచారం. ఒకవేళ ఈ నిర్ణయం అమలు అయితే మాత్రం ఈ పథకానికి పేరు వస్తుందని భావించి లబ్ధిదారులకు కూడా నేరుగా ఉపయోగపడుతుందని భావించే ఏపీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ముందు చూడాలి మరి. ఇప్పటికే సంక్షేమ పథకాల వైపుగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వచ్చే ఆర్థిక ఇబ్బందులను సీఎం చంద్రబాబు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: