తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసు లో సీఎం రేవం త్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇస్తానని సీఎం రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని తాజా గా... ఈడి అధికారులు గుర్తించారు. అంతేకాదు చార్జిషీట్లో సీఎం రేవంత్ రెడ్డి పేరును పేర్కొన్నారు.


 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు కాంగ్రెస్ నాయకులు పవన్ బన్సాల్, దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను కూడా చార్జిషీట్ లో ఈడి అధికారులు పేర్కొని షాకింగ్ ఇచ్చారు. అసోసియేట్ జర్నల్ లిమిటెడ్ కు సంబంధించిన రెండువేల కోట్ల ఆస్తులను కాజేయడానికి.... కుట్రలు జరిగినట్లు ఈడీ అధికారులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే యంగ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేశారని తెలిపారు ఈడీ అధికారులు.


దీని వెనుక సోనియా గాంధీ అలాగే రాహుల్ గాంధీ ఉన్నట్లు కూడా స్పష్టం చేశారు. అయితే యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటుకు 2019 నుంచి 2022 మధ్యలో విరాళాల రూపంలో డబ్బులు వసూలు చేసి.. పదవులు కూడా ఇస్తానని రేవంత్ రెడ్డి చాలా మందిని ప్రలోభ పెట్టినట్లు ఈడీ అధికారులు తాజాగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే నేషనల్ హెరాడ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. అయితే దీనిపై రేవంత్ రెడ్డి ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ : వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: