కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ముఖ్యంగా కలిసి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసి తన రాజకీయ లబ్ధి చేకూర్చుకున్నాడని చాలామంది అంటున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం వల్ల చాలామంది ఆంధ్రులు అనేక ఇబ్బందుల పాలయ్యారు. చాలామంది శాపానార్థాలు కూడా పెట్టారు. వారి శాపమే కేసిఆర్ కు తగులుతోందా..ఆ వివరాలు ఏంటో చూద్దాం.. విభజించు పాలించు అనే విధానాన్ని బ్రిటిష్ వారు పాటిస్తూ ఉంటారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నేర్చుకున్నారు. అప్పట్లో భారత్ పాకిస్తాన్ ను విడదీసి భారత్ పరిపాలనను తన చేతిలో పెట్టుకుంది. కాశ్మీర్ ను విడదీసి తనకు కావలసిన వ్యక్తికి పరిపాలనను అప్పజెప్పింది.

 ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఫార్ములాను అవలంబించి సక్సెస్ అయిన వ్యక్తుల్లో కేసీఆర్ కూడా ఒకరు. కలిసి ఉన్నటువంటి తెలుగు ప్రజలను ముక్కలు చేసి, ప్రాంతీయ సెంటిమెంటు ప్రజల్లో కలిగించి తన రాజకీయ లబ్ధి పొందాడు. ఈ విధంగా కాంగ్రెస్ ఫార్ములాను పాటించి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసి తాను అధికారంలోకి వచ్చాడని చెప్పవచ్చు. అన్నదమ్ముల్లా కలిసి ఉంటూ హైదరాబాదులో హ్యాపీగా బ్రతుకుతున్నటువంటి ప్రజల మధ్య చిచ్చుపెట్టి, వీళ్లు మనవాళ్లు కాదు ఆంధ్రులు అంటూ ఒక అభద్రతా భావాన్ని కలిగించాడు. ఈ విధంగా సెంటిమెంటు రగిలించి విడదీసి విభజించి చివరికి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు. ఈ విభజన సమయంలోనే ఎంతోమంది ఆంధ్రులు శపించారు.

 కెసిఆర్ కు ఏనాటికైనా సరే బుద్ధొస్తుంది పాపం తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు. అంతేకాకుండా ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడే స్థిరపడి అన్ని ఇక్కడే ఉన్నవారికి మాత్రమే ఆశ్రయం ఇచ్చాడు. ఆంధ్రా నుంచి వచ్చి కేవలం వ్యాపారాలు నడిపించే వారిని ఇబ్బందులు పెట్టి వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూశాడు కేసీఆర్. చివరికీ ఆంధ్ర ప్రాంతానికి అందరూ వెళ్లిపోతే తెలంగాణ దెబ్బతిని వ్యాపారం తగ్గుతుందని భావించిన కేసీఆర్ ఆంధ్ర ప్రజలతో కలివిడిగా ఉండడం మొదలుపెట్టాడు. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ చేసినటువంటి ఈ పనికి ఆంధ్ర ప్రజలు ఎంతో శాపనార్ధాలు పెట్టారు. అదే ఆయన పార్టీని ప్రస్తుతం వెనక్కి వచ్చేలా మరియు ఆయన కుటుంబంలో చిచ్చులు పెట్టేలా శాపం తగులుతోందని కొంతమంది అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: