- ( ఉత్త‌రాంధ్ర‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఏడాది పాలన పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో నే మంత్రివర్గ విస్తరణ లో మార్పులు చేర్పులు ఉంటాయన్న ఊహగానాలు కూడా కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర - గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ నుంచి ఒక్కొక్కరి మంత్రి పదవులు నుంచి తప్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ విధంగా మంత్రి పదవులలో వేటుపడేది ముందుగా ఎవరి ? మీద అన్న చర్చలు బాగా వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలలో నలుగురు మంత్రులు ఉన్నారు. శ్రీకాకుళం నుంచి సీనియర్ నేత కింజరాపు అచ్చం నాయుడు మంత్రిగా ఉన్నారు. విజయనగరం జిల్లా నుంచి కొండపల్లి శ్రీనివాస్ - గుమ్మడి సంధ్యారాణి , విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనిత హోం మంత్రిగా ఉన్నారు. ఈ నలుగురు మంత్రులలో సీనియర్ నేతగా ఉన్న అచ్చం నాయుడు పదవి విషయంలో ఎవరికీ ఏ రకమైన అనుమానాలు లేవు.


ఆయన ఐదేళ్లపాటు చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉంటారు అని తెలుగుదేశం పార్టీ వర్గాలు నొక్కి మరీ చెబుతున్నాయి. మిగిలిన ముగ్గురులో ఒకరి మంత్రి పదవి విషయంలో గండం ఉందనే ప్రచారం అయితే గట్టిగా సాగుతోంది. మరి ఇది ప్రచారంగా ఉంటుందా లేక నిజంగా తెప్పిస్తారా ? అన్నది ఇప్పుడు చర్చగా మారింది. మంత్రుల విషయంలో చూస్తే భారీగానే మార్పులు ఉంటే కొందరిని తప్పించడం ఖాయం అంటున్నారు. అలా కాకుండా స్వల్ప మార్పులతో సరిపెడితే ప్రచారంలో ఉన్న పేర్లలో ఎవరికి ఇబ్బంది ఉండదని అంటున్నారు. జూన్ నెలలో మంత్రివర్గంలో మార్పులు లేకపోతే మరో ఆరు నెలల దాకా ఈ ఊసే లేకపోవచ్చా అంటున్నారు. ఆగస్టులో మంచి రోజులు ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆగ‌స్టు యాంటీ సెంటిమెంట్ నెల గా మార‌డంతో బాబు ఆ నెల‌లో మార్పులు చేయ‌ర‌నే అంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: