డ్రగ్స్ ముఠా పట్టుబడినప్పుడల్లా తప్పనిసరిగా అందులో సినీ స్టార్స్ విదేశీ వ్యక్తులు ఇతర సాధారణ వ్యక్తులు మాత్రమే కనిపిస్తూ ఉంటారు. కానీ మొదటిసారి పోలీస్ శాఖ చెందిన వ్యక్తి డ్రగ్స్ దందాలో పట్టుబడడం సంచలనమైంది. అవినీతిని కట్టడి చేయాల్సినటువంటి వ్యక్తులే ఇలా చేస్తే సమాజం ఏమైపోవాలి. కంచె చేను మేసినట్టు పోలిస్ వృత్తిలో ఉండి డ్రగ్స్ దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపిస్తూ ఉన్నారు కానిస్టేబుల్ గుణశేఖర్. ఐదు కోట్ల విలువైన డ్రగ్స్ తో పట్టుబడి దేశవ్యాప్తంగా సంచలనమయ్యాడు. ఇదే కాకుండా ఆయన వివిధ ప్రాంతాల్లో పనిచేసినప్పుడు అక్రమ దందాలు, డబ్బుల వసూలు కూడా చేసేవాడని ఆరోపణలు వస్తున్నాయి. పేరులో గుణ ఉంది కానీ తన రియాల్టీలో ఏమాత్రం గుణంలేని కానిస్టేబుల్ అంటూ మాట్లాడుతున్నారు. 

ఇలాగే ఉండగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇదంతా  వైసిపి అండతోనే చేశారంటూ మాట్లాడుకోవస్తున్నారు. అయితే ఆయన కొన్నాళ్లపాటు వైసీపీ ఎంపీ గురుమూర్తికి గన్మెన్ గా పనిచేశారు. ఆ సమయంలో కూడా ఈ దందాలో ఉన్నాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇదే తరుణంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి బహిరంగగానే స్పందించారు. ఆయన అప్పట్లో నా దగ్గర పని చేశాడు కానీ ఆ తర్వాత ఏ ఆర్ కానిస్టేబుల్ గా మరో దగ్గరికి వెళ్లిపోయాడని చెప్పుకొచ్చారు. ఇలా అవినీతి చేసే వ్యక్తులను వదిలిపెట్టొద్దని ఆయనపై సిబిఐ ఎంక్వయిరీ కూడా చేయించి పూర్తి వివరాలు రాబట్టాలని బహిరంగ లేఖ రాశాడు. ఇదిలా కొనసాగుతున్న తరుణంలో  టిడిపి నాయకులు ఏమో ఆయన ఫ్యామిలీ వైసీపీలో  ఎదిగిందని, అదే అండతో ఆయన అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ మాట్లాడుకుంటున్నారు.

 గుణశేఖర్ తల్లి మూర్తి మునెమ్మ  సత్యవేడు నియోజకవర్గం కె.వి పురం మండలం జడ్పిటిసి సభ్యురాలు. తండ్రి మూర్తి సుబ్బయ్య ఆరే ఎంపీటీసీగా వైసీపీలో పని చేశారు. గుణశేఖర్ 2003లో  పోలీస్ శాఖలో కానిస్టేబుల్ గా చేరి విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. మొదటినుంచి ఆయన అవినీతి అక్రమాలకు పెద్దపీట వేస్తూ, ఏదైనా ఇష్యూ వస్తే తన రాజకీయ పలుకుబడిని వాడుకుంటూ ప్రతి దాంట్లో బయటపడుతూ వస్తున్నారు. తాజాగా డ్రగ్స్  బయటపడడంతో ఆయన ద్వారా మోసపోయిన బాధితులంతా బయటకు వచ్చి ధైర్యంగా చెప్పుకుంటున్నారు. ఈ విధంగా గుణశేఖర్ ఖాకి బట్టలను అడ్డుగా పెట్టుకొని ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆయన చేతిలో మోసపోయిన బాధితులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: