ఇరాన్ , ఇజ్రాయిల్ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇవ్వడంతో పశ్చిమాసియాలో ఉద్రికతలు మరింత దారుణంగా మారాయి .. ప్రధానంగా ఈ పరిణామాలతో ముడిచుమురు ధరలు భారీగా పెరగబోతున్నాయి .. ఈ క్రమంలోనే ఐదు నెలల గరిష్టానికి కూడా చేరుకోబోతున్నాయి .. ఇక ఈ ప్రభావం ఆసియా మార్కెట్ పై తీవ్రంగా పడనుంది .. నేటి ట్రేడింగ్‌లో చమురు ధరలు రెండు శాతానికి పైగా పెరిగాయి .. బ్రెండ్ క్రూడ్ బ్యారెల్‌ ధర 2.7% పెరగి 79.12 డాలర్ కు వెళ్లి చేరింది .. అలాగే మరొక యూఎస్ క్రూడ్ బ్యారెల్ ధర 2.8% పెరిగి 75. 98 డాలర్ కు చేరుకుంది ..


అలాగే ఆసియా మార్కెట్‌లు ప్రస్తుతం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి .. జపాన్ నిక్కీ 0.6% , దక్షిణ కొరియా కొస్పి  1.4% , ఆస్ట్రేలియా  ఎఏస్ఎక్స్  సూచి 0.7% వరకు దిగజారాయి .. అలాగే ఐరోపా అమెరికా ఫ్యూచర్ మార్కెట్ లు కూడా భారీ ఒత్తిడికి లోనువుతున్నాయి . అలాగే అమెరికా ఎస్అండ్‌పీ 500 ఫ్యూచర్స్ సూచి 0.5% , నాస్ డాక్ ఫ్యూచర్స్‌ 0.6% వరకు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి .. అలాగే మరోపక్క అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 0.1% తగ్గి 3363 డాలర్లుగా కొనసాగుతుంది .. అయితే ఇప్పుడు ఈ ప్రభావం భారత్ మార్కెట్‌ పై కూడా ప్రభావం చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి ..


ప్రధానంగా అణు కేంద్రాలపై అమెరికా బాంబుల దాడులు చేయడంతో హార్ముజ్‌ జలమార్గాన్ని మూసివేసేందుకు ఇరాన్ రెడీ అవుతుంది .. ఇక ఈ పరిణామాలు భారత్ కు తీవ్ర ఇబ్బందికరమని వ్యాపార విశ్లేషకులు అంచనా వేస్తున్నారు .. ఇరాక్ , జోర్డాన్ , లేబనాన్ , సిరియా, యెమెన్‌ సహా పశ్చిమాసియా దేశాలతో భారత్ నిర్వహిస్తున్న వాణిజ్యంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చని అంటున్నారు .. అలాగే ఇప్పటికే మన దేశం నుంచి ఇరాన్ , ఇజ్రాయిల్ కు వెళ్లే ఎగుమతులు భారీగా తగ్గిపోయాయి .. యుద్ధం మరింత తీవ్రమైతే పశ్చిమాసియా దేశాలతో మన వాణిజ్యంపై గట్టి ప్రభావం చూపుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు ..

మరింత సమాచారం తెలుసుకోండి: