అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూల్చి వేసిన సంగతి మనకు తెలిసిందే. ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేసిన సమయంలో ఇండస్ట్రీలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.ముఖ్యంగా చిన్న సమాచారం కూడా ఇవ్వకుండా ఇలా ఎలా చేస్తారు అని నాగార్జున మండిపడ్డ సంగతి తెలిసిందే. అలాగే మేము ఏ చెరువు ఆక్రమించలేదని,ఏ చెరువులో అక్రమ నిర్మాణం కట్టలేదని చెరువు భాగాన్ని అక్కడికే విడిచిపెట్టామని నాగార్జున క్లారిటీ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చెరువులు కుంటల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను కచ్చితంగా కూల్చేస్తాం అంటూ గట్టి షాకిచ్చారు. అదే సమయంలో అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పై కొండా సురేఖ అసభ్య కామెంట్లు చేసింది.. 

 నాగార్జున స్వయంగా తన కోడలు సమంతని కేటీఆర్ దగ్గరికి పంపించారని ఆస్తులు కాపాడుకోవడం కోసమే నాగార్జున అలాంటి పని చేశారని దారుణమైన కామెంట్లు చేసింది. అయితే ఈ మాటలపై అక్కినేని నాగార్జునతో పాటు చాలామంది సెలబ్రిటీలు స్పందించి కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడ్డారు. అలా అక్కినేని ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో నీచమైన పనులు చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే సడన్గా నాగార్జున రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి పోయినట్టు కనిపించారు. అయితే అప్పుడే గొడవ ఇంతలోనే మళ్లీ రేవంత్ రెడ్డి నాగార్జున ఎలా కలిసిపోయారని చాలామంది షాక్ అయ్యారు. అంతేకాదు నాగార్జున తన కొడుకుల పెళ్లిళ్లకి కూడా రేవంత్ రెడ్డి ని ఆహ్వానించారు. అలా రేవంత్ రెడ్డి నాగార్జున పెళ్లికి వచ్చారు. అయితే తాజాగా ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్న రేవంత్ రెడ్డి నాగార్జున పై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం నగరంలో కాలుష్యం బాగా పెరిగిపోయింది.

ఇలాంటి కాలుష్యం ఉన్న ప్రదేశాల్లో జీవించడం నరకంగా మారుతుంది. హైడ్రా కారణంగా ఇప్పుడిప్పుడే కబ్జాలకు గురైన చెరువులు, నాలాలు బయటపడ్డాయి. చెరువులను హైడ్రా ద్వారా కాపాడుతున్నాం.అలాగే అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చాము. ఆ తర్వాత నాగార్జుననే స్వయంగా మా దగ్గరికి వచ్చి చెరువుకి ఆనుకొని ఉన్న తన సొంత భూమి రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించారు.. అంతే కాదు మా ప్రభుత్వం చేసే ఎన్నో పనులను మెచ్చుకున్నారు. అక్కినేని నాగార్జున నిజమైన హీరో..ఆయన రెండు ఎకరాల భూమిని కూడా ప్రభుత్వానికి అప్పగించారంటే ఆయన మనస్తత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అంటూ నాగార్జున పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో రేవంత్ రెడ్డి నాగార్జున పై చేసిన కామెంట్లు మీడియాలో వైరల్ గా మారాయి

మరింత సమాచారం తెలుసుకోండి: