
అయితే చివరికి అక్కడ ఉన్నటువంటి ఒక క్రిస్టియన్స్ స్కూల్లో వాళ్ళ గ్రౌండ్ ని కూడా ఉపయోగించుకోవడానికి పర్మిషన్ ఇస్తే.. వాళ్లని బెదిరించారంటూ మొన్ననే అనిల్ యాదవ్ కూడా తెలియజేశారు. అయినా ఎట్టి పరిస్థితులలో ఆపము..ఎలా తీసుకు వస్తామో చూపెడతాము.. జన సందోహం ఎలా ఉంటుందో చూపెడతామంటూ వైసీపీ నేత అనిల్ యాదవ్ కూడా శపధం చేశారు.. అయితే ఇప్పుడు తాజాగా అనీల్ యాదవ్ శపథం విఫలమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కోటం రెడ్డి శపధం సక్సెస్ అయినట్లుగా తెలుస్తోంది.. జగన్మోహన్ రెడ్డి టూర్ క్యాన్సిల్ అయ్యిందని.. మళ్లీ హెలిపాడ్ కారణంగానే ఆగిపోయిందని సమాచారం. మళ్లీ ఎప్పుడు అన్నటువంటిది చెబుతాం అని పార్టీ నేతలు తెలియజేస్తున్నారు. ఒక రకంగా ఇలాంటి సందర్భంలో ఆపుతాము అన్నప్పుడు చాలా కసిగా వెళ్లాల్సి ఉంటుంది.. అక్కడికి దిగనివ్వము అన్నప్పుడు కచ్చితంగా అక్కడికే వెళ్లాలి. హెలిపాడ్ దారిలో కాకపోతే మరొక మార్గం నుంచి అయినా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ యుహాత్మకంగానే విఫలమైనట్లుగా కనిపిస్తోంది. వైసీపీ పార్టీ నుంచి అధికారికంగా నెల్లూరు పర్యటనకు మరి ఏ తేదీని ఎంచుకుంటారో చూడాలి. ఏపీ ప్రభుత్వం కూడా తమ పెట్టిన కండిషన్స్ కి ఓకే అని చెబితేనే వెళ్లడానికి పరిమిషన్ ఇస్తామంటూ పోలీస్ అధికారులు మాజీ సీఎంకు తెలియజేస్తున్నారు.