కొన్ని విషయాలకు సంబంధించి మీడియాలో వచ్చిన సమాచారం గురించి మాట్లాడుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించదు .. గులాబీ బాస్ తెలంగాణ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అస్వస్థతో హైదరాబాద్ సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో జాయిన్ అవ్వటం తెలిసిందే .  గురువారం రాత్రి వేళలో ఆయన ఆసుపత్రుల్లో జాయిన్ అయ్యారు .. అయితే ఆయన ఆసుపత్రిలో జాయిన్ అవుతారన్న విషయం గురువారం ఉదయం నుంచి  వార్తల్లో చ‌ర్చకు వచ్చింది .  అయితే మధ్యాహ్నం సమయంలో ఆస్పత్రిలో చేరుతారని అంచనాలు ఉన్నాయి .. అయితే కారణం ఏంటన్న దానిపై క్లారిటీ లేదు కానీ రాత్రి వేళలో ఆయన ఆస్పత్రిలో ఎడ్మిట్ అయ్యారు.
 

అలాగే గడిచిన గత రెండు రోజులగ‌ ఆయన ఎంతో నీరసంగా ఉండటం .. అల కొన్ని ఆరోగ్య పరీక్షల కోసం యశోదకు వచ్చిన ఆయనను ఆసుపత్రిలో ఎడ్మిట్ చేశారు .. గురువారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో కేసీఆర్ కు చికిత్స అందిస్తున్న యశోద ఆసుపత్రి యజమాన్యం వెంటనే హెల్త్ బుల్టెన్ కూడా విడుదల చేశారు . ఇక అందులో వైద్యులు పేర్కొన్న అంశాలన్నీ చూస్తే .. ప్రధానంగా నీర‌సంతో బాధపడుతున్న కేసీఆర్ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.. అలాగే డాక్టర్ల ప్రాథమిక పరీక్షల్లో రక్తంలో షుగర్ స్థాయిలు అధికంగా, సోడియం స్థాయిలు తక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది .. అలాగే కేసీఆర్ ఆరోగ్యం కొంత నిలకడగా ఉందని .. షుగర్ , సోడియం సాధారణ స్థితికి వచ్చేవరకు వైద్యుల పరివేక్షణలోని ఆయనకు చికిత్స అందుతుందని ప్రముఖ డాక్టర్ ఎంవీ రావు చెప్పుకొచ్చారు.

 

అలాగే ఇక్కడ కొన్ని దశాబ్దాలుగా డాక్టర్ ఎంవీ రావు కేసీఆర్ కు వైద్య సేవలు అందిస్తున్నారు.   అలాగే యశోద ఆసుపత్రిలో కేసీఆర్ చేరే సమయంలో ఆయన కుటుంబ సభ్యులు ఆయన వెంటే ఉన్నారు .. అలాగే పార్టీ నేతలు , కార్యకర్తలు , అభిమానులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు .. అయితే కేసీఆర్ ఆసుపత్రిలో చేరిన సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు . యశోద ఆసుపత్రి యజమాన్యంతో మాట్లాడిన సీఎం రేవంత్ .. కెసిఆర్ కు మెరుగైన వైద్యం అందించాలని కూడా కోరారు .  అలాగే కెసిఆర్ త్వరగా కోలుకోవాలని .. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షను సీఎం వ్యక్తపరిచారు . అదేవిధంగా ఇదే అంశంపై కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా స్పందిస్తూ .  కెసిఆర్ కు మెరుగైన వైద్యం అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని కూడా ఆయన కోరారు.   అయితే ప‌లు విశ్వసనీయ‌ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కెసిఆర్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత నంది నగర్ లోని తన ఇంట్లోనే కేసీఆర్ కొద్ది రోజులు ఉంటారని .. తన ఫామ్ హౌస్ కు వెళ్లరని అంటున్నారు  .. ఇక మరి ఏదైనా కేసిఆర్ తన అనారోగ్యం నుంచి వెంటనే కోలుకోవాలని కోరుకుందాం  .

మరింత సమాచారం తెలుసుకోండి: