గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నాయకుడు వల్లభనేని వంశీ మరోసారి ప్రైవేటు ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు .. గత వారమే బెయిల్ పై విడుదలయ్యారు . 147 రోజుల పాటు జైల్లో ఉన్నారు అన్ని కేసుల్లో బెయిల్ రావడం తో బయటకు వచ్చారు .. అయితే ఆయనకు జైల్లో ఉన్న సమయం లోనే పలు ఆరోగ్య సమస్యలు వచ్చాయి .. ఆ సమయం లోనే ప‌లుమార్లు ఆస్పత్రిలో వైద్యం తీసుకున్నారు .. ఇప్పుడు జైలు నుంచి విడుదలైన తర్వాత పరిస్థితి బాగానే ఉన్నప్పటికీ .. ఆయన కలుసుకునేందుకు పలువు రాజకీయ నాయకులు వస్తుండడం తో మళ్ళీ ఇన్ఫెక్షన్ పెరిగి ఉంటుందని సన్నిహితులు అంటున్నారు . ఇప్పటికే జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్ ను కలిశారు ..

ఇక ఆ తర్వాత నుంచి వరుసగా పార్టీ నేతలు వచ్చి ఆయనను కలుస్తూ ఓదార్పు ఇస్తున్నారు .. ఆ సమయంలో కూడా వంశీ ఎంతో యాక్టివ్ గా ఉన్నట్టు కనిపించలేదు .. బిత్తర చూపులు చూస్తూ భయం భయంగా కనిపిస్తున్నారు .. నోటికి కర్చీఫ్ అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నారు .. కొత్తగా ఆయనకు శ్వాస సమస్యలు రావడంతో ఆసుపత్రికి తరలించారు .. విజయవాడ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయనకు వైద్యం అందిస్తున్నారు .. బెయిల్ షరతుల ప్రకారం ఆయన గన్నవరం నియోజకవర్గంలోనే ఉండాలి . కానీ జైలు నుంచి విడుదలైన తర్వాత  ఆరోగ్యం పరంగా జాగ్రత్తలు తీసుకోపోవ‌డంతో , చాలామంది వచ్చి కలుస్తుండడంతో శ్వాస సమస్య మరోసారి తిరగబట్టినట్టు చెబుతున్నారు .  అలాగే ఒక కార్పొరేట్ ఆసుపత్రి లో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతుంది .. అలాగే ఆయనను కలిసేందుకు ఎవరూ రావద్దని కూడా కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు .

వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: