
అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేలుగా గెలిచిన ఇద్దరు గిరిజన మహిళా నాయకురాల్లు ఇప్పుడు అంతే అనూహ్యంగా రాజకీయాల నుంచి తప్పుకునే పరిస్థితి వచ్చేసింది. విధి వారితో వింతగా ఆడిన పొలిటికల్ నాటకంలో వారు బలి పశువులు అయిపోయారు. వారిద్దరు ఎవరో కాదు ఒకరు పాడేరు మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మరొకరు రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి. 2014 ఎన్నికలలో వీరిద్దరు పాడేరు, రంపచోడవరం నుంచి వైసీపీ తరపున తొలిసారి ఎమ్మెల్యేలు గా విజయం సాధించారు. తర్వాత వారిద్దరు పార్టీ మారారు. అక్కడితోనే వీరు రాజకీయంగా పతనమైపోయార నే చెప్పాలి. పాడేరు లో 2014 లో గెలిచిన గిడ్డి ఈశ్వరి తక్కువ టైంలోనే బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత ఆమె టీడీపీలోకి రావడంతో ఆమె ప్రభావం కోల్పోయారు. చంద్రబాబు మంత్రి పదవి ఇస్తారని ఆశపడ్డ ఆమెకు భంగపాటు తప్పలేదు. గత రెండు ఎన్నికల్లోనూ ఆమె చిత్తు చిత్తు గా ఓడిపోయారు. ఇప్పుడు పాడేరులో ఆమె పట్టు తప్పి పోయింది.
రంపచోడవరం నియోజకవర్గం నుంచి 2014లో గెలిచిన వంతల రాజేశ్వరి తర్వాత కాలంలో టిడిపి సైకిల్ ఎక్కారు. అయితే అనుకున్న విధంగా ఆమెకు టీడీపీలో గుర్తింపు లభించలేదు. అసలు మొన్న ఎన్నికల్లో ఆమెకు సీటే దక్కలేదు. మిరియాల శిరీష కు టీడీపీ సీటు ఇవ్వగా ఆమె విజయం సాధించారు. ఇప్పుడు వంతల రాజేశ్వరి ని టీడీపీలో అసలు పట్టించుకున్న వారే లేరు. ఇప్పుడున్న పరిస్థితులు.. ఆ రెండు నియోజకవర్గాల్లో కూడా వైసిపి బలంగా ఉండడంతో ఈ ఇద్దరు నాయకురాళ్ల రాజకీయం ముగిసినట్టే అంటున్నారు విశ్లేషకులు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు