కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలను సూపర్ హిట్ చేశామంటూ సీఎం చంద్రబాబు ఇటీవలే తెలియజేశారు. ఈ మాటలపైన ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అయిన వైయస్ షర్మిల అభ్యంతరాన్ని తెలియజేసింది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ట్విట్టర్ ద్వారా నిన్నటి రోజున షర్మిల ట్విట్ చేస్తూ.. ఆగస్టు 15న వేడుకలు సందర్భంగా శుక్రవారం రోజు ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది.ఇందులో భాగంగా ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచితంగా ప్రయాణించవచ్చు అంటూ తెలిపింది. విజయవాడ బస్టాండ్ సమీపంలో నిర్వహించినటువంటి ఒక సమావేశంలో సీఎం చంద్రబాబు తాను ఎన్నికలలో ఇచ్చిన హామీలను తాము సంపూర్ణంగా అమలు చేశామంటూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయ్యిందంటూ ప్రకటించుకున్నారు.


ఈ విషయం పైన అటు విపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూ ఉన్నారు. సూపర్ సిక్స్ లో మిగిలిన హామీల పరిస్థితి ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు.. ముఖ్యంగా షర్మిల ఇలా ప్రశ్నిస్తూ.. సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్ అయ్యాయి అంటూ విమర్శించింది.. 20 లక్షల ఉద్యోగాలలో ఒకటైన ఇచ్చార? నిరుద్యోగులకు ప్రతినెల 3000 ఇస్తానని చెప్పి ఏ నిరుద్యోగికైనా అందించారా.. 18 ఏళ్ల నిండిన మహిళలకు 1500 రూపాయల చొప్పున ప్రతినెల ఇస్తానని చెప్పారు. ఆ హామీ ఏమైంది అంటూ ప్రశ్నించారు.. అన్నదాత సుఖీభవ కింద రూ .20 వేల రూపాయలు ఇస్తామన్నారు ఆ విషయాన్ని మాట మార్చారు అంటూ షర్మిల విమర్శించారు.

కేంద్రం ఇచ్చేటువంటి 6000 తో లింకు పెట్టి 30 లక్షలు మంది రైతులకు ఎగనామం పెట్టారంటూ ఫైర్ అయ్యింది. తల్లికి వందనం కింద 20 లక్షలు మంది బిడ్డలకు కూడా కోతపెట్టారంటూ ఆరోపణలు చేసింది. 15000 ఇస్తామని చెప్పి 13వేల తోనే సరి పెట్టేశారు అంటూ ఫైర్ అయ్యింది షర్మిల. అధికారంలోకి వచ్చి 14 నెలల తర్వాత ప్రీ బస్సు అమలు చేసి సూపర్ సిక్స్ హామీలను తానే సక్సెస్ చేశానని చెప్పుకోవడం సిగ్గుచేటు అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఏపీ ప్రజలను ఘోరంగా మోసం చేశారు చంద్రబాబు, అలాగే జనసేన పార్టీలను ట్యాగ్ చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: