
ఇకపై అలాంటి తప్పుడు వార్తల ప్రసారాలను అరికట్టడమే కాకుండా, వాటికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కొత్త చట్టం తీసుకురానున్నామని హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. “కొంతమంది కావాలనే ఏపీ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తోంది. దానిని టార్గెట్ చేసి నెగిటివిటీని సృష్టిస్తున్నారు. తప్పుడు వార్తలు, ఫేక్ థంబ్‌నెయిల్‌లతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఇకపై అలాంటి వారెవ్వరైనా సరే కఠిన శిక్ష తప్పదు” అని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ఫాక్ట్-ఫైండింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. వాస్తవాలు ఏంటో ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తామని ఆమె చెప్పారు. ఇకపై ఫేక్ వార్తలు రాసినా, సృష్టించినా, ఫేక్ థంబ్‌నెయిల్‌లు చేసినా వారిపై కఠిన చర్యలు తప్పవని " స్ట్రైట్ వార్నింగ్ ఇచ్చారు.
రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ..“కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ఓర్చుకోలేక కొంతమంది సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు. ప్రజలకు నిజాలు ఇప్పటికే తెలుసు. వాటిని ఇంకా స్పష్టంగా తెలియజేస్తాం. ఫేక్ పెట్టి మోసం చేయాలని చూస్తే తాటతీస్తాం” అంటూ హెచ్చరించారు. “అసాంఘిక శక్తులను అరికట్టడం సీఎం చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర శాంతి భద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు” అని వంగలపూడి అనిత కఠిన హెచ్చరిక జారీ చేశారు.