కల్వకుంట్ల ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ గా నిలిచారు.. దాదాపు పది సంవత్సరాలపాటు బీఆర్ఎస్ పార్టీని అధికారంలో ఉంచి పాలన సాగించారు. అయితే మూడవసారి కూడా వీళ్లే అధికారంలోకి వస్తారని అంతా భావించారు.. అంతేకాదు కేసీఆర్ అదే భావనలో ఉండిపోయారు.. కానీ కింది స్థాయిలో ప్రజలు మాత్రం ఈసారి ఎలాగైనా బీఆర్ఎస్ ని ఓడించాలని అనుకున్నారు. చివరికి కాంగ్రెస్ కి ఓట్లు వేసి కాంగ్రెస్ ను అధికారంలోకి వచ్చేలా చేశారు.. అయితే ఇందులో కేసీఆర్ అంటే కాంగ్రెస్ కు ఓటు వేసిన ఓటర్లకు కూడా ఇష్టమే.. కానీ కింది స్థాయి నాయకుల వల్లే పార్టీ అధికారం కోల్పోవాల్సి వచ్చింది.. ఇదిలా నడుస్తున్న సమయంలో కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని జైలుకు వెళ్లి రావడం  బీఆర్ఎస్ ను మరింత కలవర పెట్టింది. 

ఆమె బయటకు వచ్చిన తర్వాత  ఎవరు పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల కాస్త నిరాశ చెందినటువంటి కవిత బీఆర్ఎస్ పై తిరుగుబాటు బావుటా ఎగరవేస్తూ వచ్చింది.. ముందుగా తన అన్న కేటీఆర్ ను విమర్శిస్తూ తన తండ్రిని తనకు కాకుండా చేస్తున్నారని ఆయనకు నా గురించి నెగిటివ్ గా చెబుతూ నాకు దూరం చేస్తున్నారని, కేసీఆర్ చుట్టూ దయ్యాలే ఉన్నాయని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకు జాగృతి పేరుతో పార్టీని కూడా పెట్టింది. ఇదిలా నడుస్తున్న సమయంలోనే తాజాగా కల్వకుంట్ల కవిత ప్రెస్ మీట్ పెట్టి మరీ మా నాన్నను మోసం చేసేది హరీష్ రావు సంతోష్ రావు అంటూ కొండ బద్దలు కొట్టింది.. కాళేశ్వరం పేరుతో మా నాన్నకు మరక అంటించాలని చూస్తున్నారని, అలాంటి మహోన్నత నాయకుడి పేరు నాశనం చేయాలని ఆ వ్యక్తులు చూస్తున్నారంటూ చెప్పుకొచ్చింది..

ఆమె ఎప్పుడైతే ఈ విధంగా మాట్లాడిందో అప్పుడే బీఆర్ఎస్ పార్టీలో పూర్తిగా చీలికలు వచ్చాయని అందరు అనుకున్నారు.. అంతేకాదు ఆమె మాటలపై బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాస్త గరం గరమయ్యారు. దీంతో పార్టీ నాయకులు చర్చించుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేశారు. కట్ చేస్తే పార్టీ నుంచి ఈమె ఎప్పుడైతే సస్పెండ్ వార్తలు బయటకు వచ్చాయో అప్పటినుండి రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు ఆమె చిత్రపటాన్ని కాల్చివేస్తూ పగ తీర్చుకున్న లెవెల్ లో ప్రవర్తించారు. ఇదే సమయంలో తెలంగాణ భవన్లో కూడా కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చారు.. దీంతో తెలంగాణ భవన్ కు మంటలు అంటుకున్నాయి.. వెంటనే అలెర్ట్ అయినా ఫైర్ సిబ్బంది మంటలు  ఆర్పేశారు..

మరింత సమాచారం తెలుసుకోండి: