తెలంగాణ రాజకీయాలలో ప్రస్తుత పరిణామాలను చూస్తూ ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు విపరీతమైన భయం పట్టుకున్నట్లుగా ప్రజల భావిస్తున్నారు. ఎందుకంటే ఎలాంటి సందర్భం వచ్చిన సరే తన మీద ఆరోపణలు వచ్చిన ప్రత్యర్థులకు చుక్కలు చూపించే కేసీఆర్, రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల ఆత్మరక్షణలో వెళ్లిపోయారు. ముఖ్యంగా కాలేశ్వరం ప్రాజెక్టు పైన ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి ఆధారంగానే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో వీటిపైన చర్చలు పెట్టి ఆ ప్రాజెక్టుకు సంబంధించి సిబిఐ విచారణ చేపట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. సిబిఐ విచారణ అనగానే అటు కెసిఆర్, హరీష్ రావుకు భయం మొదలైనట్లుగా సంకేతం కనిపిస్తోంది.


ఇందుకు హైకోర్టు ఆశ్రయించడమే ఉదాహరణ అన్నట్టుగా వినిపిస్తున్నాయి. ఏదైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే వాటి పట్ల అభ్యంతరాలను తెలియజేసే అధికారం ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చలేరు? కానీ చట్టబద్ధత ఉంటే న్యాయస్థానాలను  ఆశ్రయిస్తారు. కానీ ఏదైనా ఒక నేరం జరిగిందని తేల్చిన తర్వాత ఆ నేరం వెనుక ఎవరెవరి హస్త ముందనే విషయంపై తేల్చడానికి దర్యాప్తు సంస్థకు అప్పగిస్తే మాత్రం వాటిని వ్యతిరేకించడానికి ఎవరికీ అధికారం ఉండదు?. ముఖ్యంగా ఎవరైతే నేరంపై ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారే ఈ దర్యాప్తును జరగకూడదు అంటూ చెప్పడం  వెనుక మర్మమేంటి అనే సందేహం మొదలవుతుంది.


ఇప్పుడు కేసీఆర్ ఇలా చేయడంతో తెలంగాణ ప్రజలకు కలుగుతున్న సందేహం కూడా అదే.. హైకోర్టును ఆశ్రయించి అసలు సిబిఐకి కేసును అప్పగించవద్దు అంటూ చెప్పడంలో ఎలాంటి లాజిక్ ఉందంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సిబిఐ అధికారులు అడుగు పెట్టడానికి వీలు లేకుండా ఉత్తర్వులను తీసుకువచ్చారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసరికి  ఆయనే స్వయంగా సిబిఐ విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.పిసి ఘోష్ కమిషన్ నివేదికతో శిక్షలు పడవు కాబట్టి ఆ విచారణ సాగినంత కాలం బిఆర్ఎస్ పార్టీ  సైలెంట్ గానే ఉన్నది. ఆ విచారణకు కూడా అటు కేసీఆర్ ,హరీష్ రావుతో సహా చాలామంది హాజరయ్యారు.

చట్టబద్ధతను కలిగిన నేర నిరూపణ చేయగలిగిన సిబిఐ దర్యాప్తు అనగానే ఇప్పుడు అటు కేసీఆర్ ,హరీష్ రావు వెనకడుగు వేస్తున్నారు.పీసీ ఘోష్ నివేదిక ఆధారంగానే సిబిఐ అధికారులు దర్యాప్తు చేయబోతున్నారు. అయినా కూడా హైకోర్టును ఆశ్రయించిన తీరును బట్టి చూస్తూ ఉంటే వారికి భయం పట్టుకున్నట్లుగా వ్యక్తం అవుతోంది. ఈ కేసును స్వయంగా కేసీఆర్ సిబిఐకి అప్పగించాలని చెప్పకపోతే మాత్రం అటు కార్యకర్తలలో ,ప్రజలలో మరిన్ని అనుమానాలకు తావునిచ్చేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: