
ఆరోజు కాలేశ్వరం కూలేశ్వరం అని మాట్లాడిన వారే ఈరోజు అక్కడి నుంచి హైదరాబాద్ కి నీరు తెచ్చుకున్నారు.. కాలేశ్వరం జలాల నీరు తెస్తున్నారా? లేదా అనే విషయం సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి.. కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్లు తెచ్చుకుంటూ మళ్లీ వాటి మీద విష ప్రచారం చేస్తున్న రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి అంటూ ఫైర్ అయ్యారు. ఈ కాలేశ్వరం కట్టడానికి 94 వేల కోట్లు ఖర్చు అయితే లక్ష కోట్ల కుంభకోణం అని ఆరోపణలు చేస్తున్నారు.. కుంగిన చోట ఏజెన్సీ వచ్చి రిపేరు చేస్తామంటే ప్రభుత్వమే ఒప్పుకోవడం లేదని మాట్లాడారు.
1100 కోట్లతో పూర్తి అయ్యే ఈ ప్రాజెక్టుకు 7400 కోట్లకు పెంచేశారని తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే దానిని పక్కన పెట్టి మరి అంత ఖర్చు చేస్తున్నారు. ఇందులో అవినీతి కోణం మాత్రమే కాదు, ఒక క్రిమినల్ కోణం కూడా ఉందంటూ ఫైరయ్యారు. గతంలో సుంకీశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలడానికి కారణమైనటువంటి కంపెనీకే ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా ఇస్తున్నారు.. అలాంటి వారి పైన చర్యలు తీసుకోకుండా మళ్లీ ఇలాంటి కొత్త పెద్ద ప్రాజెక్టులు ఇస్తున్నారు. దీని వెనుక ఉద్దేశమేంటి.. కేంద్రమే బ్లాక్ చేసిన ఈ కంపెనీలకు పిలిచి పనులు ఇస్తున్నారు అంటూ ఆరోపణలు చేశారు.