అధికారం ఉంటే ఏదైనా చేయగల సత్తా ఉంటుంది..అయితే కొన్ని పనులు కొంతమందికి మాత్రమే పరిమితం..అది వేరే వాళ్ళు చేస్తే ఏదో పెద్ద హత్య చేశారు అనే రేంజ్ లో చూస్తారు. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే..ఆ రోజు అల్లు అర్జున్ చేస్తే తప్పయింది..కానీ ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తే అదే పని ఒప్పయింది. ఈ తప్పు ఒప్పు మేటర్ ఏంటి అని మీకు డౌట్ రావచ్చు.. ఇక అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప-2 మూవీ విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ టాక్ రావడమే కాదు అల్లు అర్జున్ జీవితంలో ఒక చీకటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ సమాచారం ఇవ్వకుండానే రోడ్ షోలో పాల్గొనడంతో హీరోని చూడ్డానికి చాలామంది అభిమానులు ఎగబడి చివరికి తొక్కీసలాట జరిగి ఓ మహిళ ప్రాణాలు కోల్పోవడమే కాకుండా ఆ మహిళ కొడుకు చావు బతుకులతో ఇప్పటికి పోరాడుతున్నాడు..

 ఇక ఈ విషయంలో అల్లు అర్జున్ పై కేసు పెట్టి అల్లు అర్జున్ బహిరంగంగా రోడ్ షో నిర్వహించారు.అది కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రోడ్ షో చేయడం వల్లే అలా తొక్కిసలాట జరిగింది అని ఆయనపై కేసు పెట్టి ఒకరోజు జైలు జీవితం గడిపేలా కూడా చేశారు. ఇక ఆ సమయంలో సెలబ్రిటీలైన సామాన్యుడైన అందరికీ ఒకే చట్టం అని కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్ పై కక్ష కట్టినట్టే ప్రవర్తించారు.ముఖ్యంగా పర్సనల్గా అల్లు అర్జున్ పై నాకు ఎలాంటి పగలేదు అని చెబుతూనే అల్లు అర్జున్ రోడ్ షో సమయంలో జరిగిన తొక్కిసలాట విషయాన్ని పదే పదే చెబుతూ బన్నీని అవమానించారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ అల్లు అర్జున్ చేసిన పనే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేశారుగా అంటున్నారు బన్నీ ఫ్యాన్స్. ఎందుకంటే రీసెంట్ గా రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ మీద జరిగిన  గణేష్ నిమర్జనాలను చూడడానికి వచ్చారు. ఆ సమయంలో ఓ సామాన్య వ్యక్తిలాగే రావడంతో చాలామంది అధికారులు ట్రాఫిక్ నియంత్రణను పక్కనపెట్టి రేవంత్ రెడ్డికి బందోబస్తు చేయాల్సి వచ్చింది.

ఎందుకంటే రేవంత్ రెడ్డి అక్కడికి రావడంతో చాలామంది జనాలు ఒక్కసారిగా గుమిగూడారు. దాంతో రేవంత్ రెడ్డికి పోలీసులు భద్రత కల్పించాల్సి వచ్చింది. అయితే ఈ విషయాన్ని బన్నీ ఫ్యాన్స్ లేవదీస్తూ ఆరోజు అల్లు అర్జున్ సమాచారం ఇవ్వకుండా రోడ్ షో చేశారని మీరు ప్రశ్నించారు. కానీ ఇప్పుడు మీరు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సామాన్య వ్యక్తిలాగా వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగించారు కదా.. మీ వల్ల అధికారులు మీకు బందోబస్తు చేసి ట్రాఫిక్ ని పక్కన పెట్టారు.దానివల్ల ఎంతోమంది ప్రజలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి అనేక ఇక్కట్లు పడ్డారు. మరి మీరు చేసింది కూడా తప్పే కదా.. ఆరోజు బన్నీ చేసింది తప్పైతే ఈరోజు మీరు చేసింది కూడా తప్పే.. బన్నీకి ఒక రూల్ మీకు ఒక రూలా అంటూ సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెగ వైరల్ చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్.చట్టం ప్రతి ఒక్కరికి సమానమే అంటే బన్నీ చేసింది తప్పైతే మీరు చేసింది కూడా తప్పే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: