అక్కినేని ఫ్యామిలీలోకి శోభిత ధూళిపాళ్ల పెద్ద కోడలుగా అడుగు పెట్టింది. అయితే సమంత మొదట నాగచైతన్య భార్యగా ఇంటికి పెద్ద కోడలుగా అడుగు పెట్టినప్పటికీ కోడలు బాధ్యతను ఎన్నో రోజులు నిలుపుకోలేక పోయింది.చైతూ సమంత ల మధ్య విభేదాలు వచ్చి పెళ్లైన నాలుగేళ్లకే డివోర్స్ తీసుకున్నారు. ఇక సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభిత ప్రేమలో పడిపోయారు. అలాగే గత ఏడాది వీరి పెళ్లి అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.. అలా శోభిత అక్కినేని వారింటి కోడలు అయింది. ఇక పెళ్లయ్యాక శోభిత కాస్త సినిమాలు తగ్గించినప్పటికీ ఈ మధ్యనే సినిమాకి సంబంధించిన కొత్త అప్డేట్ ఇచ్చింది.ఇదిలా ఉంటే సినిమాల్లోకి వచ్చిన కొత్త లో ప్రతి ఒక్కరికి ఏదో ఒక అవమానం జరుగుతూనే ఉంటుంది.అది బ్యాక్గ్రౌండ్ ఉన్నవారికైనా సరే..లేనివారికైనా సరే.. 

అయితే బ్యాక్గ్రౌండ్ ఉన్న వారి కంటే బ్యాగ్రౌండ్ లేని వారికే ఎక్కువ చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి.అలా శోభిత ధూళిపాళ్లకు కూడా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ చేదు అనుభవం ఎదురయిందట. అది కూడా చాలా చీప్ గా కుక్కతో పోల్చి చూసారట. ఇక విషయంలోకి వెళ్తే.. శోభితకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఒక యాడ్ కంపెనీ నుండి ఫోన్ వచ్చిందట.. ఇక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అక్కడికి వెళ్లగా మీరు ఒక యాడ్ కి సెలెక్ట్ అయ్యారు. గోవా వెళ్ళండి అని చెప్పడంతో కాస్త షాక్ అయినప్పటికీ ఆ తర్వాత గోవా కి వెళ్ళిందట.అలా మొదటి రోజు గోవా షూటింగ్ కి వెళ్ళాక టెక్నికల్ ఇష్యూ అని చెప్పి తర్వాత రోజు షూటింగ్ చేద్దామని తెలిపారట. దాంతో శోభిత వెళ్లిపోయిందట.

కానీ ఆ తర్వాత శోభిత అక్కడికి వెళ్లగా.. ఆమె లాంటి బిహేవియర్ స్ట్రెంత్ ఉన్న అమ్మాయి మన కంపెనీ బ్రాండ్ కి సరిపోదు.మన బ్రాండ్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఉండాలంటే అమ్మాయి అంత కాన్ఫిడెంట్ ఉండకూడదు అని మాట్లాడుకున్నారట. అయితే ఈ మాటలు శోభిత చెవిన పడడంతో చాలా బాధపడిపోయిందట. అంతేకాదు ఆ తర్వాత శోభిత చేయాల్సిన ప్లేస్ లో ఒక కుక్కని పెట్టి అవమానించారట. అలాగే ఒకరోజు షూట్ కోసం వచ్చినందుకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఇచ్చి పంపించారట. అలా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో తనకు ఎదురైన చేదు అనుభవం ఇదే అంటూ శోభిత ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇక శోభిత గతంలో చెప్పిన ఈ వీడియో మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో చాలామంది నెటిజన్లు అక్కినేని కోడలినే ఇంత అవమానించారా అంటూ కామెంట్లు పెడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: