
ఇక ఈ సినిమా కదా నేపథ్యం 80వ దశకం లోని సికింద్రాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగనున్నట్లు సమాచారం . నాని ఈ మూవీలో డ్యూయల్ రోల్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తుంది . ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం చిత్ర నిర్మాతలు హైదరాబాద్ శివారులలో దాదాపు 30 ఎకరాల విస్తీర్ణం లో భారీ మురికి వాడాలా సెట్స్ నిర్వహించారట . ఇటీవల ఈ మూవీ నుంచి నాచురల్ స్టార్ నాని ఫస్ట్ లుక్ విడుదల చేయగా భారీ స్పందన లభించింది .
పక్కింటి అబ్బాయి లాగా ఉండే నాని రెండు పొడవాటి జడలు వేసుకుని రగ్గుడ్ లుక్ లో జడల్ గా అదరగొట్టాడు . టాలీవుడ్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం దాదాపు పారడైజ్ను నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ 100 కోట్లకు పైగా ఖర్చుపెట్టి నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది . తమిళ్ స్పెషల్ అనిరుద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ మొత్తం ఎనిమిది భాషల్లో రిలీజ్ కానుంది . సమ్మర్ కానుకగా వచ్చే ఏడాది మార్చ్ 26న వరల్డ్ వైస్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది.